రైల్ కోచ్‌ దిగువ భాగం నుంచి వెలువడిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

|

Dec 08, 2023 | 7:24 PM

దేశంలో మరో రైలుకు పెను ప్రమాదం తప్పింది. భువనేశ్వర్‌ – హౌరా జన్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలులో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి . అయితే, సకాలంలో స్పందించి వెంటనే మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనేశ్వర్‌ నుంచి హౌరా వెళ్తున్న జన్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలు గురువారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో కటక్‌ చేరుకోగానే మంటలు చెలరేగాయి.

దేశంలో మరో రైలుకు పెను ప్రమాదం తప్పింది. భువనేశ్వర్‌ – హౌరా జన్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలులో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి . అయితే, సకాలంలో స్పందించి వెంటనే మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనేశ్వర్‌ నుంచి హౌరా వెళ్తున్న జన్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలు గురువారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో కటక్‌ చేరుకోగానే మంటలు చెలరేగాయి. కోచ్‌ దిగువ భాగం నుంచి పొగలు వెలువడ్డాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు రైలు నుంచి కిందకు దిగిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని అధికారులు తెలిపారు. అనంతరం రైలు 7:15కి కటక్‌ నుంచి బయలుదేరి వెళ్లినట్లు తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లి వేడుకలో బెల్లీ డాన్స్‌ అదరగొట్టిన తాతగారు !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

ఆటో డ్రైవర్‌ సాహసం.. తప్పిన పెను ప్రమాదం

కన్నీరు పెట్టుకున్న కిమ్‌ !! నియంతను ఏడిపించిన వారు ఎవరు ??

డమ్మీ బాంబు అని భావించిన దంపతులకు షాక్‌ !!

తెలుగు సినిమా విలన్‌ అరెస్ట్‌ !! పొలం సరిహద్దులో చెట్లు నరికే విషయంలో వివాదం

Published on: Dec 08, 2023 07:23 PM