ఆటో డ్రైవర్ సాహసం.. తప్పిన పెను ప్రమాదం
గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ఆటో ట్రాలీలో అగ్ని ప్రమాదం సంభవించింది. అప్రమత్తమైన డ్రైవర్ సమయస్పూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన గుంటూరు జిల్లా 216వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎప్పటిలాగే శ్రీకాంత్ అనే ఆటో డ్రైవర్ భట్టిప్రోలు నుండి రవాణా ఆటోలో గ్యాస్ సిలెండర్లతో ఐలవరం బయలుదేరాడు. భట్టి ప్రోలు దాటిన కొద్ది సేపటికే ఆటో గమనంలో తేడా రావడంతో.. అనుమానం వచ్చి ఆటోను పక్కనే ఆపి కిందకి దిగి చూశాడు.
గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ఆటో ట్రాలీలో అగ్ని ప్రమాదం సంభవించింది. అప్రమత్తమైన డ్రైవర్ సమయస్పూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన గుంటూరు జిల్లా 216వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎప్పటిలాగే శ్రీకాంత్ అనే ఆటో డ్రైవర్ భట్టిప్రోలు నుండి రవాణా ఆటోలో గ్యాస్ సిలెండర్లతో ఐలవరం బయలుదేరాడు. భట్టి ప్రోలు దాటిన కొద్ది సేపటికే ఆటో గమనంలో తేడా రావడంతో.. అనుమానం వచ్చి ఆటోను పక్కనే ఆపి కిందకి దిగి చూశాడు. ఆటో ఇంజన్ భాగంలో నుండి చిన్న మంట రావటాన్ని గమనించాడు. వెంటనే శ్రీకాంత్ ఆటోలోని గ్యాస్ సిలెండర్లను కింద పడేశాడు. ఎందుకైనా మంచిదని భావించి ఆటోను మరికొద్ది దూరి తీసుకెళ్లి నిలిపివేశాడు. ఆ తర్వాత మంటలు ఆటో మొత్తం వ్యాపించాయి. మంటల్లో ఆటో పూర్తిగా కాలిపోయింది. శ్రీకాంత్ సమయస్పూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. లేదంటే మంటలు అంటుకొని గ్యాస్ సిలెండర్లు పేలితే భారీ నష్టం సంభవించేదని స్థానికులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కన్నీరు పెట్టుకున్న కిమ్ !! నియంతను ఏడిపించిన వారు ఎవరు ??
డమ్మీ బాంబు అని భావించిన దంపతులకు షాక్ !!
తెలుగు సినిమా విలన్ అరెస్ట్ !! పొలం సరిహద్దులో చెట్లు నరికే విషయంలో వివాదం
అవి కృత్రిమ నవ్వులు !! బందీలకు మత్తుమందు ఇచ్చిన హమాస్
ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న పాక్ అమ్మాయి భారత్ అబ్బాయి !! కొవిడ్ కష్టాలు దాటి ఒక్కటవుతున్న వేళ
వరల్డ్ వండర్ కిడ్స్ .. చిన్న వయసు.. పెద్ద మనసు!
రైలు ఇంజిన్ చెక్ చేస్తున్న పైలట్.. అక్కడ మనిషి తలను చూసి..
ఫేస్బుక్ ఫ్రెండ్ ఆశల ఎర.. రూ.1.75 కోట్లు పోగొట్టుకున్న మహిళ!
చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..
తాంత్రిక పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి!
భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్లో చూపించిన భర్త!
ఇదేం భక్తయ్యా.. రైలు తగలబెడతావా ఏంటి సామీ!

