హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..
ఫిల్మ్ ఛాంబర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విద్యత్ షార్ట్ సర్క్యూట్ తో దట్టమైన పొగలు అలుముకున్నాయి. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలను ఆర్పేందుకు ఫైరింజన్ కు సమాచారం అందించారు అక్కడి సిబ్బంది.
ఫిల్మ్ ఛాంబర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భవనం లోపల పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలను ఆర్పేందుకు ఫైరింజన్‌కు సమాచారం అందించారు అక్కడి సిబ్బంది. స్వరుచి కిచెన్‌లో మంటలు చెలరేగాయని తెలుస్తోంది. ఇవి క్రమంగా ఫిల్మ్ ఛాంబర్లోకి వ్యాపించి ఉండవచ్చని ప్రథమికంగా గుర్తించారు. ఫిలిం ఛాంబర్ బిల్డింగ్‌లో ఉండే స్వరుచి హోటల్ కిచెన్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దట్టమైన పొగ అలుముకుంది. ట్రాఫిక్ సిబ్బంది అక్కడకు చేరుకుని వాహనాలు రోడ్డుపై నిలబడకుండా ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అంచనా వేస్తున్నారు అధికారులు. ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Apr 03, 2024 06:37 PM