Andhra: సీటు కోసం బస్సులో రప్పా.. రప్పా.. వీడియో
బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో సదరు మహిళ సీటులో కూర్చోబోతున్న యువకుడిని అడ్డుకొని దాడి చేయడంతో ... ప్రతిఘటించే క్రమంలో యువకుడు కూడా మహిళపై దాడి చేశాడు. సహనం కోల్పోయిన యువకుడు జేబులో ఉన్న పెన్ తో మహిళపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఇరువురు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో తోటి ప్రయాణీకులు వారిని అదుపు చేశారు. అయితే ఈ సీన్ అంతటిని ఓ ప్రయాణికుడు తన మొబైల్ ఫోన్ లో వీడియో తీయటంతో ఇపుడు వీరి కొట్లాట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మహిళల ఉచిత బస్సు ప్రయాణాలపై తెగ సెటైర్లు వేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకంతో మహిళలకు RTC బస్సులలో ఉచిత ప్రయాణాల మాట ఏమో గానీ బస్సులలో ప్రయాణించే మహిళల సంఖ్య మాత్రం బాగా పెరిగింది.అదే క్రమంలో బస్సులలో సీట్లు కోసం చిన్నపాటి గొడవలు, సిగపట్లు పట్టడం వంటివి పెరిగాయి. అయితే మహిళల్లో మహిళలు కొట్టుకోవడం ఒక ఎత్తయితే…. మగవాళ్ళు, ఆడవాళ్లు మధ్య ఎక్కువగా కొట్లాటలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న విజయనగరం జిల్లా బొబ్బిలిలో బస్సులో ఒక మగ వ్యక్తితో మహిళ సీటు కోసం గొడవపడి అతని చెంప చెళ్లుమనిపించింది. దీంతో ఇద్దరు సిగపట్లు పట్టారు…తాజాగా గురువారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అలాంటి సీనే రిపీట్ అయింది. టెక్కలి నుంచి నందిగం మండలం దిమ్మిడిజోల వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులో బుధవారం ఒక మహిళ ప్రయాణికురాలుకి, ఓ యువకుడు(విద్యార్ధి)కి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.
Published on: Sep 12, 2025 01:55 PM
