స్టార్ క్రికెటర్‌కు విడాకులిచ్చి.. దిల్ రాజు సినిమా కోసం హైదరాబాద్ కు వచ్చి

Updated on: Apr 28, 2025 | 7:14 PM

ఇటీవలే భారత క్రికెటర్‌ చాహల్‌తో విడాకులు తీసుకుంది ధనశ్రీ వర్మ. 2020లో చాహల్‌ను పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగమ్మ ఐదేళ్లకే తన వివాహా బంధానికి వీడ్కోలు పలికింది. దీని తర్వాత మళ్లీ తన ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే డ్యాన్సర్ గా, కొరియోగ్రాఫర్ గా ధనశ్రీకి మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు ఇదే క్రేజ్ తో సినిమాల్లోకి అడుగు పెట్టనుంది.

ఆమె త్వరలోనే ఓ తెలుగు సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ప్రొడక్షన్‌ బ్యానర్ లో బలగం తర్వాత హర్షిత్, హన్షిత ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతోనే ధన శ్రీ వర్మ టాలీవుడ్ కు పరిచయం కానుంది. అలాగే ఢీ ఫేమ్, స్టార్ కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్ కూడా ఈ సినిమాతోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. శశి కుమార్‌ ముతులూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటి కార్తీక మురళీధరన్‌ మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే మరో కీ రోల్ కోసం ధనశ్రీ వర్మ ను ఎంపిక చేసుకున్నారట. భరతనాట్యం నుంచి ఆధునిక నృత్యం వరకు వివిధ రకాల నృత్యాలలో ప్రావీణ్యం ఉన్న నటి కోసం చిత్ర బృందం వెతుకుతుండగా ధన శ్రీ వర్మ పేరు వినిపించిందట. ఇక పాత్ర నచ్చడంతో ధనశ్రీ కూడా నటించేందుకు వెంటనే అంగీకరించిందట. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ‍సెట్స్‌లో ధనశ్రీ వర్మ కనిపించింది. యష్ మాస్టర్ తో కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరలయ్యాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sreeleela: శ్రీలీల ఫేట్ మార్చిన ఫేస్ బుక్ పోస్ట్

Nayanthara: హీరోయిన్ కాక ముందు నయన్ ఏం చేసేదో తెలుసా ??