Shriya Muralidhar: గుండెపోటుతో యువ యూట్యూబర్‌ మృతి! (Video)

Shriya Muralidhar: గుండెపోటుతో యువ యూట్యూబర్‌ మృతి! (Video)

Ravi Kiran

|

Updated on: Dec 09, 2021 | 8:42 AM

ప్రముఖ యూట్యూబర్‌, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ శ్రియా మురళిధర్‌ మృతి చెందారు. డిసెంబర్‌ 7 సోమవారం రాత్రి గుండెపోటుతో 27 ఏళ్ళ శ్రియా కన్నుమూశారు. అంతకంటె ముందు ఆమెకు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యలు స్పష్టం చేశారు. యూట్యూబ్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న శ్రియా ముర‌ళీధ‌ర్… యాంకర్ ప్రదీప్ రియాలిటీ షో ‘పెళ్లి చూపులు’లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. అలాగే పలు షార్ట్ ఫిల్మ్స్‌‌లో కూడా నటించింది. యాంకర్‌గా కూడా పలు కార్యక్రామాల్లో మెప్పించింది.