కొత్త ట్రెండ్ సెట్ చేసిన యంగ్ డైరెక్టర్స్..
యాక్షన్ సినిమాల గోల నుంచి ప్రేక్షకులకు రిలీఫ్ ఇస్తూ, యువ దర్శకులు కామెడీ చిత్రాల కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తున్నారు. టాప్ స్టార్స్ సైతం హాస్య కంటెంట్ పై ఆసక్తి చూపిస్తుండటంతో, టిల్లు, మ్యాడ్ వంటి చిత్రాలతో కామెడీ సినిమాల జోరు ఊపందుకుంది. రాబోయే కాలంలో మరిన్ని హాస్య చిత్రాలు వెండితెరపై సందడి చేయనున్నాయి.
మాస్ సినిమాల హవా నడుస్తున్నప్పటికీ, కొంతమంది దర్శకులు ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. యాక్షన్ ఘోషతో విసిగిపోయిన ప్రేక్షకులకు కామెడీ టచ్ ఇస్తూ, ఈ జోనర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలు సాధిస్తున్నాయి. ప్రస్తుతము టాప్ స్టార్స్ కూడా కామెడీ కంటెంట్‌పై దృష్టి సారిస్తుండటంతో, వెండితెరపై కామెడీ చిత్రాల ప్రాబల్యం పెరుగుతోంది. సంక్రాంతికి అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రాబోతున్న మన శంకర ప్రసాద్ గారు సినిమాలో మెగాస్టార్ చిరంజీవిని కామెడీ టైమింగ్‌ను పర్ఫెక్ట్‌గా ఒడిసి పట్టుకొని వింటేజ్ చిరంజీవిని మళ్ళీ ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. టిల్లు, మ్యాడ్ సిరీస్ చిత్రాలు హాస్య కంటెంట్‌పై నమ్మకాన్ని మరింత పెంచాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సెంచరీ స్టార్స్… సౌత్‌లో క్రేజీ కెప్టెన్స్
బాహుబలి కథ నుంచి క్యూ కడుతున్న ప్రీక్వెల్స్
రామ్ చరణ్ 18 ఏళ్ల ప్రస్థానం.. పెద్ది అప్‌డేట్‌తో మెగా ఫ్యాన్స్‌లో ఉత్సాహం
