Yatra2: సీఎం జగన్ బయోపిక్ ఎలా ఉందంటే ??
ప్రస్తుతం ఏపీలో పొలిటికల్ వేడి కొనసాగుతోంది. ఈ వేడి మధ్యలోనే.. సరిగ్గా ఎలక్షన్స్ ముందరే.. యాత్ర2 రిలీజైంది. మరి ఈ సినిమా యాత్ర 1 లాగే హిట్టవుతుందా.. ? అసలు ఎలా ఉంది? ఎంటర్‌టైన్ చేసిందా..లేక జగన్ పొలిటికల్ మీటింగ్‌కు వెళ్లినట్టే ఉందా..? అనేది తెలియాలంటే వాచ్ దిస్ రివ్యూ..! యాత్ర2 మనకు తెలిసిన కథే.. పూపర్లో.. చదివిన కథే.. న్యూసుల్లో చూసిన కథే! వైఎస్ రాజశేఖర్ రెడ్డి అలియాస్ మమ్ముట్టి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల సమస్యలపై మరింత ఫోకస్ పెడతారు.
ప్రస్తుతం ఏపీలో పొలిటికల్ వేడి కొనసాగుతోంది. ఈ వేడి మధ్యలోనే.. సరిగ్గా ఎలక్షన్స్ ముందరే.. యాత్ర2 రిలీజైంది. మరి ఈ సినిమా యాత్ర 1 లాగే హిట్టవుతుందా.. ? అసలు ఎలా ఉంది? ఎంటర్‌టైన్ చేసిందా..లేక జగన్ పొలిటికల్ మీటింగ్‌కు వెళ్లినట్టే ఉందా..? అనేది తెలియాలంటే వాచ్ దిస్ రివ్యూ..! యాత్ర2 మనకు తెలిసిన కథే.. పూపర్లో.. చదివిన కథే.. న్యూసుల్లో చూసిన కథే! వైఎస్ రాజశేఖర్ రెడ్డి అలియాస్ మమ్ముట్టి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల సమస్యలపై మరింత ఫోకస్ పెడతారు. అదే టైంలో తన కొడుకు జగన్ మోహన్ రెడ్డి అలియాస్ జీవాను ప్రజలకు పరిచయం చేస్తాడు. ఎంపిగా పోటీ చేయిస్తాడు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో రచ్చబండకు బయల్దేరిన వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణిస్తారు. దీంతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతాయి. ఎమ్మెల్యేలు తమకు ముఖ్యమంత్రిగా జగన్ ఉండాలని ప్రతిపాదిస్తే.. దాన్ని హై కమాండ్ కాదనడం.. ఆయన్ని తీవ్రంగా అవమానించడంతో.. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడతాడు. అక్కడ్నుంచి హై కమాండ్‌కు కొరకరాని కొయ్యగా మారిపోతాడు. పార్టీని బలోపేతం చేస్తున్న సమయంలోనే.. అక్రమాస్తుల కేసులో జగన్‌ను జైలుకు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది.. మళ్లీ అక్కడ్నుంచి ఎలా నిలిచాడు.. గెలిచాడు అనేది అసలు కథ..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ ఉద్యోగులకు ఫైనల్ వార్నింగ్.. ఆఫీస్‌కి వస్తారా ?? రారా ??
KFC In Ayodhya: అయోధ్యలో కేఎఫ్‌సీ..ఆ ఒక్కటీ తప్ప అన్నీ అమ్ముకోవచ్చట
కటింగ్ చేయించుకోమన్న డీన్.. ఆ విద్యార్ధి ఏంచేశాడో తెలుసా ??
ఖరీదైన మా రోలెక్స్ వాచ్‌లను కొట్టేస్తున్నారు.. లండన్‌లో భారత సీఈవోల ఆందోళన
క్యాన్సర్‌తో కుడిచేయి తీసేసినా.. 2 నెలల్లో ఎడమ చేతితో పరీక్షకు సిద్ధం