Megastar Chiranjeevi: అభిమానికి మెగాస్టార్‌ భరోసా!

Updated on: Aug 30, 2025 | 1:45 PM

హీరోలపై ఒక్కొక్కరు ఒక్కోలా తమ అభిమానం చాటుకుంటారు. తమ అభిమాన హీరో సినిమా విడుదలైనప్పుడు థియేటర్ల వద్ద పెద్ద పెద్ద కటౌట్లు పెడతారు.. పాలాభిషేకాలు చేస్తారు. కొందరు తమ అభిమాన హీరోను కలుసుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి సైకిల్‌ యాత్రలు, పాదయాత్రలు చేస్తారు. అలా మెగాఫ్యామిలీకి వీరాభిమాని అయిన ఓ మహిళ ఏపీ నుంచి తెలంగాణకు సైకిల్‌ యాత్ర చేపట్టింది.

చిరంజీవి పుట్టినరోజున స్వయంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలపాలని సంకల్పంతో సైకిల్‌పై బయలుదేరి ఎట్టకేలకు చిరంజీవిని కలిసింది. కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన రాజేశ్వరి మెగా ఫ్యామిలీకి వీరాభిమాని. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయనను కలిసి స్వయంగా శుభాకాంక్షలు చెప్పాలని కొన్ని వందల కిలోమీటర్లు సైకిల్‌ తొక్కుతూ వచ్చి మెగాస్టార్‌ను కలిసారు. విషయం తెలుసుకున్న చిరంజీవి ఆమె అభిమానానికి, తనను చేరుకోడానికి ఆమె పడిన కష్టానికి చలించిపోయారు. రాజేశ్వరిని హృదయపూర్వకంగా ఆహ్వానించారు. ఆమె అంకిత భావానికి ముగ్ధుడైన చిరంజీవి ఆమెను ప్రశంసించారు. అన్నయ్యగా చిరంజీవికి రాఖీ కట్టిన రాజేశ్వరిని ఆడపడుచుగా భావించి ఆశీర్వదించి, అందమైన చీరను బహుమతిగా ఇచ్చారు. అంతేకాదు, రాజేశ్వరి పిల్లల చదువు కోసం పూర్తిస్థాయిలో ఆర్ధిక సహాయం అందిస్తానని చిరు హామీ ఇచ్చారు. తన అభిమానులను కుటుంబ సభ్యుల్లా చూసుకునే చిరంజీవి గొప్ప మనసుకు ఇది మరొక ఉదాహరణగా నిలిచింది. కాగా ఏపీలోని ఆదోని పట్టణం నుంచి చిరంజీవిని కలిసేందుకు సైకిల్‌ యాత్ర చేపట్టారు రాజేశ్వరి. ఎన్నో శారీరక, మానసిక సవాళ్లు ఎదురైనా చిరంజీవిపై ఆమెకున్న అభిమానం ముందు తలొంచాయి. గతంలో పవన్‌ కళ్యాణ్‌ విజయం కోసం మోకాళ్లపై గుడి మెట్లను ఎక్కి ఆంజనేయస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు రాజేశ్వరి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆకట్టుకుంటున్న కదంబ పుష్పాల గణపతి

Vijayashanti: తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారు

బంగారం వదిలేసి కొత్త బాట పట్టిన తమిళనాడు స్మగ్లర్లు

శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ.. సూర్యరశ్మితో ఇంధనం తయారీ!

సెల్ఫీ డెత్‌ రేటింగ్‌లో ఇండియా టాప్‌