పర్సనాలిటీ రైట్స్ కోసం ఢిల్లీ కోర్టుకే ఎందుకు? వీడియో

Updated on: Dec 14, 2025 | 8:16 PM

సెలబ్రిటీలు తమ పర్సనాలిటీ రైట్స్ పరిరక్షణకు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడానికి బలమైన కారణాలున్నాయి. దేశంలోని ప్రధాన కార్పొరేట్ సంస్థలు, ముఖ్యంగా గూగుల్, యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా దిగ్గజాల రిజిస్టర్డ్ కార్యాలయాలు ఢిల్లీలోనే ఉన్నాయి. దీంతో, ఒకేచోట పిటిషన్ వేయడం ద్వారా దేశవ్యాప్తంగా నియంత్రణ సాధ్యమవుతుంది.

మన స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగార్జునలతో పాటు బాలీవుడ్ ప్రముఖులు ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ వంటివారు తమ పర్సనాలిటీ రైట్స్ పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర వంటి వివిధ రాష్ట్రాలకు చెందిన సెలబ్రిటీలు కూడా ఢిల్లీ హైకోర్టులోనే పిటిషన్లు దాఖలు చేయడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఢిల్లీ దేశ రాజధాని కావడమే దీనికి ప్రధాన కారణం. దేశంలోని అనేక ప్రముఖ కార్పొరేట్ కంపెనీల రిజిస్టర్డ్ కార్యాలయాలు ఢిల్లీలోనే నెలకొల్పబడ్డాయి. ముఖ్యంగా, గూగుల్, యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి మెజారిటీ సోషల్ మీడియా కంపెనీలన్నీ తమ ప్రధాన కార్యాలయాలను ఢిల్లీలోనే ఏర్పాటు చేసుకున్నాయి. అంతేకాకుండా, వీటన్నింటికీ అనుమతులు ఇచ్చే ప్రభుత్వ సంస్థలు కూడా ఢిల్లీలోనే ఉన్నాయి.

మరిన్ని వీడియోల కోసం :

పాక్‌లో సంస్కృతం కోర్సు వీడియో

రైల్వే సంచలన నిర్ణయం వీడియో

మెస్సీ కోసం హనీమూన్‌ వాయిదా.. కొత్త పెళ్లికూతురి క్రేజీ ప్లకార్డ్‌ వీడియో

వర్క్‌ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్స్‌ను మళ్లీ తీసుకురండి వీడియో