అప్పుడు దేఖలేదు.. ఇప్పుడు.. ఈ సినిమా గురించే అందరి నోటా మాట
మారుతి నిర్మించిన రొమాంటిక్ థ్రిల్లర్ 'బ్యూటీ' జనవరి 2 నుండి ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. IMDbలో 8.8 రేటింగ్ సాధించిన ఈ చిత్రం, తండ్రి-కూతుళ్ల బంధం, ప్రేమ, మోసం చుట్టూ తిరుగుతుంది. అంకిత్ కొయ్య, నీలఖి, నరేష్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీని JSS వర్ధన్ డైరెక్ట్ చేశారు. థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్‌గా ప్రేక్షకులను అలరించనుంది.
ఓటీటీలోకి ఇప్పుడు సరికొత్త రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ రాబోతుంది. రాజాసాబ్ మూవీ డైరెక్టర్ మారుతి నిర్మించిన మూవీ ఇది. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఆ సినిమా పేరే బ్యూటీ. IMDBలో 8.8 రేటింగ్ తెచ్చుకున్న బ్యూటీ మూవీ… జనవరి 2 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఇదే విషయాన్ని ఈ మూవీ టీం అఫీషియల్ గా తాజాగా అనౌన్స్ చేసింది. రొమాంటిక్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ మూవీని JSS వర్ధన్ డైరెక్ట్ చేశాడు. అంకిత్ కొయ్య, నీలఖి, సీనియర్ నటుడు నరేష్ కీ రోల్స్ చేశారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్‌గనిన్ అందించిన పాటలు మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. అందులోనూ కన్నమ్మ అంటూ సాగే మెలోడీ సాంగ్ ఇప్పటికీ యూట్యూబ్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ సాంగ్ విన్న వాళ్లు ఈ మూవీ గురించి ఆరా తీయడం కనిపిస్తోంది. ఈక్రమంలోనే థియేట్రిలక్ రిలీజ్ కంటే కూడా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడెప్పుడా అంటూ కొందరు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక బ్యూటీ మూవీ కథ విషయానికి వస్తే.. నారాయణ అలియాస్ నరేశ్ క్యాబ్ డ్రైవర్. అతడికి తన కూతురు అలేఖ్య అలియాస్ నీలఖి అంటే ప్రాణం. ఆమె సంతోషం కోసం ఏమైనా చేస్తాడు. ఇక అలేఖ్య ఏమో ఇంటర్ చదువుతుంటుంది. అయితే అనుకోకుండా ఆమెకు ఒకరోజు పెట్ ట్రైనర్ అర్జున్ అలియాస్ అంకిత్‌తో పరిచయం ఏర్పడుతుంది. కొంతకాలానికి ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. ఈ క్రమంలోనే ఒకరోజు అర్జున్ తో అలేఖ్య అసభ్యకరంగా వీడియో కాల్ మాట్లాడుతుంది. ఆ విషయాన్ని గుర్తించిన తల్లి వాసుకీ కూతురిపై చేయి చేసుకుంటుంది. దీంతో తన ప్రియుడితో కలిసి వెళ్లిపోతుంది అలేఖ్య. వారిద్దరి కోసం నారాయణ కూడా హైదరాబాద్ వెళ్లిపోతాడు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఈ ప్రేమ జంటకు.. అమ్మాయిలను వేధించే ముఠా నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. ? చివరకు నారాయణ తన కూతురిని కలుసుకున్నాడా లేదా ? అనేది సినిమా. ఈ సినిమాను రాజాసాబ్ సినిమా డైరెక్టర్ మారుతి నిర్మించారు. తాను ప్రాణంగా చూసుకున్న కూతురు.. ప్రేమ పేరుతో పారిపోయి… ఆ తర్వాత మోసపోతే ఓ తండ్రి పడే బాధ ఎలా ఉంటుందనే అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ వర్దన్. ఇందులో మరోసారి తన నటనతో కట్టిపడేశారు నరేశ్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రేక్షకులకు ఈ సినిమా ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. స్టోరీ పాయింట్ నచ్చితే .. మీరూ ఓ లుక్కేయండి!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Psych Siddhartha Review: నందు కొత్త స్టైల్ సైక్ సిద్ధార్థ్ సినిమా.. హిట్టా..? ఫట్టా..?
Vanaveera Review: వన వీర.. మైథలాజికల్ డ్రామా ఎలా ఉందంటే
iBOMMA Ravi: పోలీస్ మార్క్ విచారణలో తన కోట్ల సంపాదన బయటపెట్టిన రవి
Rajinikanth: అనుకున్నది ఒక్కటి.. అవుతోంది ఒక్కటి !! పాపం రజినీ
