Gaami: అఘోరగా టాలీవుడ్ స్టార్ హీరో.! లుక్స్ చూస్తే.. గూస్‌బంప్సే.!
డైరెక్టర్ విద్యాధర్ తెరకెక్కిస్తోన్న సినిమా ‘గామి’. ఈ మూవీ తెలుగు సినీ పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో కలర్ ఫోటో హీరోయిన్ చాందినీ చౌదరి కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా గురించి చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేయగా.. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో టాలీవుడ్ యంగ్ హీరో అఘోరగా భయపెట్టేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. పోస్టర్ డిజైనింగ్ చాలా బాగుంది. “అతని అతిపెద్ద భయం మానవ స్పర్శ.
డైరెక్టర్ విద్యాధర్ తెరకెక్కిస్తోన్న సినిమా ‘గామి’. ఈ మూవీ తెలుగు సినీ పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో కలర్ ఫోటో హీరోయిన్ చాందినీ చౌదరి కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా గురించి చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేయగా.. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో టాలీవుడ్ యంగ్ హీరో అఘోరగా భయపెట్టేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. పోస్టర్ డిజైనింగ్ చాలా బాగుంది. “అతని అతిపెద్ద భయం మానవ స్పర్శ. అతని లోతైన కోరిక కూడా మానవ స్పర్శే” అంటూ పోస్టర్ పై రాసిన క్యాప్షన్ ఆసక్తిని కలిగిస్తోంది. ఇంతకీ అతను ఎవరో గుర్తుపట్టారా ?.. ఎవరో కాదు.. యంగ్ హీరో విశ్వక్ సేన్.
ప్రస్తుతం గ్యాంగ్ ఆఫ్ గోదావరి, VS 10 చిత్రాల్లో నటిస్తున్నారు విశ్వక్. ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. అలాగే విశ్వక్ నటిస్తున్న సినిమాల్లో గామి ఒకటి. ఈ మూవీ కొన్నాళ్లుగా షూటింగ్ జరుపుకుంటుంది. కానీ ఇప్పటివరకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయలేదు. తాజాగా రిలీజ్ చేసిన గామి ఫస్ట్ లుక్ పోస్టర్‌లో … అఘోర పాత్రలో విశ్వక్ లుక్ ఆశ్చర్య కలిగిస్తోంది. అదరికీ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇక గతంలో ఈ సినిమా గురించి విశ్వక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. దాదాపు నాలుగున్నర ఏళ్లుగా ఈ మూవీ కోసం వర్క్ చేస్తున్నట్లు చెప్పారు. తమ పాత్ర విభన్నంగా ఉంటుందని.. హిమాలాయలు, వారణాసి వంటి ప్రాంతాల్లో షూట్ చేస్తున్నామన్నారు. సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos