తొక్కిసలాట ఘటనపై.. సుప్రీంకోర్టుకు విజయ్ పార్టీ
ప్రముఖ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ, కరూర్ జిల్లాలో సెప్టెంబర్ 27న జరిగిన బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనపై విచారణ జరిపేందుకు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేస్తూ మద్రాస్ హైకోర్టు అక్టోబరు 3న ఆదేశాలు జారీ చేసింది.
అయితే, ఈ ఆదేశాలను టీవీకే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సిట్ విచారణను సవాలుచేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర పోలీసుల విచారణ నిష్పక్షపాతంగా సాగదన్న అనుమానాలను తమ పిటిషన్‌లో వ్యక్తం చేసింది. మరోవైపు కరూర్ తొక్కిసలాట బాధితులను వ్యక్తిగతంగా కలిసి పరామర్శించేందుకు అనుమతి ఇవ్వాలని టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన తమిళనాడు డీజీపీకి ఈ-మెయిల్ ద్వారా ఒక విజ్ఞప్తి పంపారు. బాధితులతో నేరుగా మాట్లాడి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే విజయ్ వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా బాధిత కుటుంబాలతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు వారిని స్వయంగా కలవాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల అనుమతి కోసం అధికారికంగా ప్రయత్నాలు చేపట్టారు. అయితే, విజయ్ విజ్ఞప్తికి పోలీసుల నుంచి అనుమతి లభిస్తుందా? లేదా? అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరూర్ సభలో తొక్కిసలాట జరగడానికి విజయ్ ఆలస్యంగా రావడమే ప్రధాన కారణమని పోలీసులు ఇప్పటికే ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, ఆయన పర్యటనకు అధికారులు అంగీకరించకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు, ఈ దుర్ఘటనపై విజయ్, స్టాలిన్ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. ప్రభుత్వ వైఫల్యం, సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విజయ్ ఆరోపిస్తుండగా… విజయ్ నిర్లక్ష్యమే ప్రజల ప్రాణాలు తీసిందని ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోంది. కాగా, కరూర్‌లో జరిగిన ఈ విషాద ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 61 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కాంతార సక్సెస్ ఎఫెక్ట్.. ఏకంగా రూ.12 కోట్లతో.. కోటలాంటి ఇల్లు కట్టుకున్న రిషబ్
గట్టిగా ఇచ్చిపడేసిన బిగ్ బాస్.. దెబ్బకు బిత్తర పోయిన కంటెస్టెంట్స్
కోట్లు ఇచ్చినా.. స్టార్ హీరోలతో కొట్టించుకోను.. సినిమా ఛాన్స్‌పై మల్లారెడ్డి చమత్కారం!
మురుగు నీరు కారణంగా చిక్కుల్లో బిగ్ బాస్ !! షో ఆగిపోయే పరిస్థితి !!
లగ్జరీ కార్ల కోసం అక్రమ మార్గలు.. ED రైడ్స్‌తో చిక్కుల్లో స్టార్స్
