Vijay: దళపతి ఫ్యాన్స్‌కు ఎమోషనల్ మూమెంట్‌

Edited By: Phani CH

Updated on: Nov 14, 2025 | 12:19 PM

కోలీవుడ్‌లో ప్రస్తుతం విజయ్ చివరి చిత్రం "జన నాయగన్" మరియు ఆయన కొడుకు జాసన్ సంజయ్ దర్శకుడిగా "సిగ్మా"తో తొలి అడుగు వేయడం హాట్ టాపిక్‌గా మారింది. తండ్రి రాజకీయ రంగ ప్రవేశంతో వెండితెరను వీడుతుంటే, కొడుకు వారసత్వాన్ని కొనసాగించేందుకు వస్తున్నారు. అభిమానులు ఈ రెండు పరిణామాలపై ఆనందం, ఆశ్చర్యం మధ్య సందిగ్ధంలో పడ్డారు.

కోలీవుడ్‌లో ఇంట్రస్టింగ్ సిచ్యుయేషన్ కనిపిస్తోంది. తమిళ టాప్ హీరో విజయ్‌ చివరి సినిమా.. ఆయన కొడుకు మొదటి సినిమా ఒకేసారి బజ్‌ క్రియేట్ చేస్తున్నాయి. దీంతో ఈ టాపిక్‌ గురించి సౌత్‌ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. విజయ్‌ సిల్వర్‌ స్క్రీన్‌కు దూరమైనా.. ఆ గ్యాప్‌ను వారసుడు ఎంత వరకు కవర్‌ చేస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ నటిస్తున్న లేటెస్ట్ అండ్ లాస్ట్ మూవీ జన నాయగన్‌. ఇప్పటికే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేసిన దళపతి… ఆల్రెడీ ఇదే తన చివరి సినిమా అని కన్ఫార్మ్ చేశారు. అందుకే అభిమానులు ఈ మూవీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతున్న జన నాయగన్ ప్రమోషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ప్రతీ అప్‌డేట్‌ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. విజయ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా, అదే సమయంలో ఆయన పొలిటికల్‌ కెరీర్‌కు కూడా హెల్ప్ అయ్యేలా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. విజయ్‌ ఆఖరి సినిమా ప్రమోషన్స్‌ జరుగుతుండగానే ఆయన వారసుడు జాసన్‌ సంజయ్‌ తొలి సినిమా ప్రమోషన్‌ స్టార్ట్ అయ్యింది. దర్శకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్న జాసన్‌ సంజయ్‌, సందీప్ కిషన్ హీరోగా సిగ్మా సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ టీజర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ రెండు అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్ కన్‌ఫ్యూజన్‌లో పడిపోయారు. తమ అభిమాన నటుడి ఆఖరి సినిమా అని ఫీల్ అవ్వాలో.. ఆయన వారసుడి డెబ్యూని సెలబ్రేట్ చేసుకోవాలో అర్ధం కాక ఇబ్బంది పడుతున్నారు. అదే సమయంలో ఈ రెండు సినిమాలను బిగ్‌ హిట్ చేసేందుకు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రెండు చేతులూ లేకపోయినా బైక్‌పై దూసుకెళ్లిన..

రైలు కదిలిపోతోంది.. నా పైసలు ఇచ్చెయ్‌ అన్నా.. ప్లీజ్‌

వేగంగా దూసుకెళ్తున్న కారు.. సైడ్ మిర్రర్ నుంచి సైలెంట్‌గా వచ్చిన పాము.. కట్ చేస్తే

చిన్న రక్త పరీక్షతో క్యాన్సర్ ముప్పు గుర్తింపు

అది రైలు బ్రో.. మన ఇల్లు కాదు.. అలా ఎలా చేస్తావ్ ??

Published on: Nov 14, 2025 12:16 PM