Rashmika Mandanna: దోస్తులకు బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన రష్మిక.. ఫోటోలు వైరల్
విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి 26, 2026న ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం జరగనున్నట్లు ప్రచారం. దీనికి బలం చేకూర్చుతూ, రష్మిక శ్రీలంక ట్రిప్ ఫోటోలను షేర్ చేసింది. అభిమానులు ఈ గర్ల్స్ ట్రిప్‌ను ఆమె 'బ్యాచిలరేట్ పార్టీ'గా భావిస్తున్నారు, దీంతో పెళ్లి ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.
విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ జంట ఫిబ్రవరి 26, 2026న ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో వివాహం చేసుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ.. లేటెస్ట్ గా రష్మిక తన ప్రాణ స్నేహితులతో కలిసి శ్రీలంకలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. ఇది కేవలం గర్ల్స్ ట్రిప్ మాత్రమే కాదు, రష్మిక ‘బ్యాచ్‌లరట్ పార్టీ’ అని అభిమానులు, నెటిజన్లు ఫిక్స్ అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రష్మిక తన బిజీ షెడ్యూల్ నుంచి రెండు రోజులు విరామం తీసుకుని, తన ప్రాణ స్నేహితులతో కలిసి శ్రీలంకలోని ఒక అందమైన రిసార్ట్‌కు వెళ్ళింది. ఈ ట్రిప్ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ రష్మిక చేసిన పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. “నాకు దొరికిన 2 రోజుల విరామంలో నా గర్ల్స్ గ్యాంగ్ తో కలిసి శ్రీలంకలోని ఒక అద్భుతమైన ప్రాపర్టీకి వెళ్లాను. గర్ల్స్ ట్రిప్స్ అనేవి ఎంత చిన్నవైనా సరే.. అవి ఎప్పుడూ ‘ది బెస్ట్’ గానే ఉంటాయి. నా స్నేహితులు అందరికంటే బేస్ట్.. కొందరు స్నేహితులు మిస్ అయ్యారు కానీ, ఉన్న వారితో గడిపిన ఈ సమయం చాలా ప్రత్యేకం అని రష్మిక పోస్ట్ చేసింది. ఫోటోలలో రష్మిక సమ్మర్ డ్రెస్‌లు, మెరిసే పార్టీ వేర్‌లో చాలా సంతోషంగా కనిపించింది. సూర్యాస్తమయం, సముద్రపు అలలు, కొబ్బరి నీళ్లు.. ఇలా ప్రకృతి ఒడిలో ఆమె గడిపిన తీరు చూస్తుంటే, ఇది కేవలం విహారయాత్ర కాదు, పెళ్లికి ముందు స్నేహితులతో జరుపుకున్న ‘బ్యాచిలర్ పార్టీ’ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun: బన్నీ కోసం 1758 కిలోమీటర్ల సైకిల్ యాత్ర! తెలిసి అక్కున చేర్చున్న ఐకాన్ స్టార్
Dhurandhar: దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి! ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఆకస్మిక మృతి!
