Rashmika Mandanna: విజయ్ తో పెళ్లి గురించి రష్మిక లేటెస్ట్ కామెంట్‌

Updated on: Dec 06, 2025 | 2:16 PM

విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి వార్తలు మళ్లీ తెరపైకి వచ్చాయి. "ఖండించలేను, ఒప్పుకోలేను" అంటూ రష్మిక చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. రాజస్థాన్‌లో ఫిబ్రవరిలో వీరిద్దరి పెళ్లి జరగనుందని ఊహాగానాలున్నాయి. ఇద్దరూ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, అభిమానులు ఈ వార్తలపై ఆసక్తిగా ఉన్నారు. ఈ వ్యాఖ్యలు మరింత ఉత్సుకతను రేకెత్తిస్తున్నాయి.

విజయ్‌ దేవరకొండ – రష్మిక పెళ్లి వార్తలు మరోసారి స్క్రీన్‌ మీదకు వచ్చేశాయి. వాటిని ఒప్పుకోనూ లేనూ.. ఖండించనూ లేను అంటూ రష్మిక చేసిన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. ఇంతకీ పెళ్లెప్పుడు? నేను లైఫ్లో ఎప్పుడూ చేయని పనులు ఇప్పుడు చేస్తున్నా.. ఒకేసారి రెండు ప్రాజెక్టులు.. మరో వైపు వ్యక్తిగత పనులు.. ఇంకోవైపు కెరీర్‌ డిమాండ్‌ చేస్తున్న విషయాలు.. అంటూ ఈ మధ్య విజయ్‌ దేవరకొండ పెట్టిన పోస్టును ఇంకా ఇష్టంగా చూసుకుంటున్నారు ఫ్యాన్స్. అంతలోనే పెళ్లికి సంబంధించిన వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఫిబ్రవరిలో విజయ్‌తో రష్మిక పెళ్లి అన్నది ఓపెన్ సీక్రెట్‌ అంటున్నారు జనాలు. దీని మీద రష్మిక స్పందించారు. పెళ్లి గురించి ధృవీకరించలేను.. అలాగని ఖండించలేను.. కాకపోతే ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడతానని చెప్పారు రష్మిక మందన్న. ప్రస్తుతం విజయ్‌, రష్మిక ఇద్దరూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఫిబ్రవరిలో రాజస్థాన్‌లో డెస్టినేషనల్‌ వెడ్డింగ్‌ చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారన్నది సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kalki 2: ప్రభాస్ కల్కి 2 లో హీరోయిన్ ఆ ముద్దుగుమ్మేనా ??

అవతార్ 3 థియేటర్లలో మహేష్‌ !! హాలీవుడ్‌లో మార్కెట్‌ పై జక్కన్న మాస్టర్ ప్లాన్

iBomma Ravi: ఐ-బొమ్మ రవికి మేమేం జాబ్ ఆఫర్ చేయలే

TOP 9 ET News: అఖండ రిలీజ్‌ కోసం రెమ్యునరేషన్ ను వదులుకున్న బాలయ్య

స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!