ఉగ్రదాడిపై హీరో పాజిటివ్ పోస్ట్‌.. దారుణంగా తిట్టిన ఇండియన్స్‌.. దెబ్బకు యూటర్న్‌

Updated on: May 01, 2025 | 3:39 PM

పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ సెలబ్రిటీలందరూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఈక్రమంలోనే విజయ్‌ ఆంటోని కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. కానీ తన పోస్ట్ కారణంగా తీవ్ర విమర్శల పాలయ్యాడు ఈ హీరో. దీంతో రంగంలోకి దిగిన ఈయన తన ఇంటెన్షన్‌ ఏంటో చెబుతూ ఎక్స్‌లో వివరణ ఇచ్చాడు.

“నా పోస్టును తప్పుగా అర్థంచేసుకున్నవారికి…” అంటూ ఓ లెటర్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేశాడు విజయ్. ఇక అందులో “కాశ్మీర్‌లో దారుణమైన మారణహోమానికి పాల్పడ్డారు. దీని ఏకైక లక్ష్యం బలమైన ఐక్యత బంధాన్ని విచ్ఛిన్నం చేయడమే. భారత ప్రభుత్వం, మనం భారతీయులు మన సార్వభౌమత్వాన్ని బలమైన హస్తంతో కాపాడుకుంటాం” అంటూ రాసుకొచ్చారు. ఇక అంతుకు ముందు “చనిపోయిన వారికి నా సంతాపం తెలుపుతున్నాను. అయితే పాకిస్తాన్‌లో 50 లక్షల మంది భారతీయు గురించి ఆందోళన చెందుతున్నాను. మనలాగా పాకిస్తాన్‌లో ఉన్నవారు కూడా శాంతి, సంతోషాన్ని మాత్రమే కోరుకుంటారు. కాబట్టి ద్వేషాన్ని వదిలేసి మానవత్వాన్ని చాటుకుందాం” అంటూ తన మొదటి పోస్టులో రాసుకొచ్చాడు విజయ్‌. ఈ పోస్ట్ కారణంగా నెట్టింట తీవ్ర విమర్శలపాయల్యాడు. అంతేకాకుండా ట్రోలింగ్ కు గురయ్యాడు. ఈక్రమంలోనే తన ఇంటెన్షన్‌ వివరిస్తూ.. మరో పోస్ట్ పెట్టాడు. ఇప్పుడా పోస్ట్‌తో నెట్టింట వైరల్ అవుతున్నాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మా హీరోను అన్నావ్ సరే.. మరి నీకేం తెలుసు బోడి