Saindhav: థియేటర్లో తుస్సు.! కానీ OTTలో మాత్రం దిమ్మతిరిగే రీసౌండు.

|

Feb 04, 2024 | 10:10 AM

ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఏకంగా నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగ రిలీజ్ అయి సూపర్ హిట్‏గా నిలిచాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ సృష్టించాయి. అయితే ఇప్పుడు ఇవే సినిమాలు ఓటీటీలో అలరించేందుకు రెడీ అయ్యాయి. అందులో ఓ సినిమా ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసింది. అదే సైంధవ్. అయితే థియేటర్లో కాస్త మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తాజాగా ఓటీటీలో మాత్రం దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది.

ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఏకంగా నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగ రిలీజ్ అయి సూపర్ హిట్‏గా నిలిచాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ సృష్టించాయి. అయితే ఇప్పుడు ఇవే సినిమాలు ఓటీటీలో అలరించేందుకు రెడీ అయ్యాయి. అందులో ఓ సినిమా ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసింది. అదే సైంధవ్. అయితే థియేటర్లో కాస్త మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తాజాగా ఓటీటీలో మాత్రం దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. ఓటీటీ ప్లాట్‌ ఫాం అమేజాన్‌లో ఓ రేంజ్‌లో రీసౌండ్‌ చేస్తోంది. ఇక విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన సినిమా సైంధవ్‌. జనవరి 12న విడుదలైన ఈ మూవీ థియేటర్లో మిక్స్‌డ్ టాక్ వచ్చేలా చేసుకుంది. అలాంటి ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మంచి రెస్పాన్స్‌ను రాబడుతోంది.

థియేటర్లలో మిస్ అయినవారు ఓటీటీలో ఈ సినిమాను ఎగబడి చూస్తుండడంతో.. ఆ ప్లాట్‌ ఫాంలో మంచి ర్యాంకింగ్ అండ్ రేటింగ్ దక్కించుకుంటోంది. ఇక చాలా కాలం తర్వాత ఈ సినిమాతో మాస్ యాక్షన్ హీరోగా కనిపించాడు వెంకీ. అయితే ఇన్నాళ్లు ఫ్యామిలీ స్టార్, కామెడీ కింగ్ గా చూసిన అడియన్స్.. సైంధవ్ లో వెంకీ క్యారెక్టర్‌ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్‌ చూసి ఎగ్జైట్ అయ్యారు. వెంకీని ఇలాంటి యాక్షన్ సినిమాలే చేయాలని… స్టిల్ సోషల్ మీడియాలో డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos