Varun Tej: వరుణ్ తేజ్ పరిస్థితి ఏంటి.. కనకరాజు కరుణిస్తాడా..?

Edited By:

Updated on: Jan 21, 2026 | 5:00 PM

వరుణ్ తేజ్ కెరీర్ బాగా డల్‌గా ఉందిప్పుడు.. కొన్నేళ్లుగా ఈయన సినిమాలు ఎప్పుడు వచ్చి వెళ్లిపోతున్నాయో కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి సమయంలో ఆయన ఆశలన్నీ ఒకే సినిమాపై ఉన్నాయి. అనౌన్స్‌మెంట్‌తోనే ఓ రకమైన క్యూరియాసిటీ క్రియేట్ చేసిన ఆ సినిమా టీజర్ విడుదలైందిప్పుడు. మరి అదేంటి.. ఈ సినిమాతో అయినా వరుణ్ జాతకం మారుతుందా.. చూస్తున్నారుగా.. వరుణ్ తేజ్ మేకోవర్..!

వరుణ్ తేజ్ కెరీర్ బాగా డల్‌గా ఉందిప్పుడు.. కొన్నేళ్లుగా ఈయన సినిమాలు ఎప్పుడు వచ్చి వెళ్లిపోతున్నాయో కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి సమయంలో ఆయన ఆశలన్నీ ఒకే సినిమాపై ఉన్నాయి. అనౌన్స్‌మెంట్‌తోనే ఓ రకమైన క్యూరియాసిటీ క్రియేట్ చేసిన ఆ సినిమా టీజర్ విడుదలైందిప్పుడు. మరి అదేంటి.. ఈ సినిమాతో అయినా వరుణ్ జాతకం మారుతుందా.. చూస్తున్నారుగా.. వరుణ్ తేజ్ మేకోవర్..! హిట్టు కోసం గుర్తు పట్టలేనంతగా మారిపోయారీయన. మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న సినిమాకు కొరియన్ కనకరాజు టైటిల్ ఖరారు చేసారు మేకర్స్. కొరియన్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న ఈ చిత్రంలో ఫారెన్ యాక్టర్స్ నటిస్తున్నారు. మిరాయ్ ఫేమ్ రితికా నాయక్ హీరోయిన్. ఈ సినిమా వరుణ్ కెరీర్‌కు అత్యంత కీలకంగా మారింది. 2019లో వచ్చిన గద్ధలకొండ గణేష్, ఎఫ్ 2 తర్వాత వరుణ్ తేజ్‌కు హిట్స్ లేవు. ఎఫ్ 3 పర్లేదనిపించింది.. సోలో హీరోగా నటించిన ఆపరేషన్ వాలెంటైన్, గని, మట్కా సినిమాలు దారుణంగా నిరాశ పరిచాయి. ఈ టైమ్‌లో వరుణ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజుపైనే ఉన్నాయి. అనౌన్స్‌మెంట్ నుంచే ఈ సినిమాపై ఆసక్తి పెంచేసారు దర్శకుడు మేర్లపాక గాంధీ. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా తర్వాత మేర్లపాక గాంధీ కూడా ట్రాక్ తప్పారు. ఇటు వరుణ్, అటు గాంధీ ఇద్దరూ కలిసి కొరియన్ కనకరాజుతో ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. టీజర్ ఇంట్రెస్టింగ్‌గా కట్ చేసారు. సత్య కామెడీని హైలైట్ చేసారు. సమ్మర్‌లో సినిమా విడుదల కానుంది. మరి చూడాలిక.. ఈ కనకరాజు మెగా కుర్రాడి కెరీర్‌ను గాడిన పడేస్తాడో లేదో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Keerthy Suresh: మరోసారి బాలీవుడ్‌ వైపు చూస్తున్న కీర్తి సురేష్.. అంతలా ఏముంది అక్కడ

Don 3: డాన్‌ -3 విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చిన మేకర్స్

Karthi: అభిమానులకు షాక్ ఇచ్చిన కార్తి.. ఖైదీ 2 ఉన్నట్లా.. లేనట్లా

Dhanush: మరో వివాదంలో ధనుష్‌.. ఆ సినిమా పై కేసు

తగ్గేదే లే అంటున్న సీనియర్ స్టార్లు.. దూకుడు మాములుగా లేదుగా