Varun Tej: ఆ ట్రెండ్‌ను పట్టుకున్న వరుణ్ తేజ్‌.. మరి ఇలాగైనా సక్సెస్ అవుతారా

Updated on: Mar 27, 2025 | 3:25 PM

హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి వరుస సినిమాలు చేస్తున్న వరుణ్‌ తేజ్‌కు బిగ్ ఝలక్ తగిలింది. ఈ మెగా ప్రిన్స్ చేస్తున్న సినిమాలు ఈ మధ్య నెగెటివ్ టాక్ తెచ్చుకోవడం ఎక్కువవుతోంది. వెరైటీ కథను ఎంచుకునే వరుణ్‌ స్పిరిట్‌కు ఇది ఇబ్బందిగా కూడా మారింది. అయినా కానీ తన పంథాను ఏమాత్రం మార్చుకుని వరుణ్‌.. ట్రెండ్‌ను మాత్రం ఈ సారి పట్టేసుకున్నాడు.

కామెడీ హర్రర్ జానర్లో మేర్ల గాంధీ డైరెక్షన్లో వరుణ్ తేజ్ ఓ సినిమా చేస్తున్నారు. మూహూర్త కార్యక్రమాన్ని కూడా ముగించి షూటింగ్‌ను బిగిన్ చేశాడు. దాంతో పాటే.. సినిమా ఎలా ఉండనుందనే ఓ కాన్సెప్ట్ వీడియోను కూడా వదిలాడు ఈ హీరో. తమ సినిమా రిలీజ్‌ ముందో.. లేదా అనౌన్స్మెంట్ ముందో.. కోలీవుడ్ డైరెక్టర్లు ఎక్కువగా ఇలా చేస్తుంటారు. అలా తమ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యేలా చేస్తారు. ఇప్పుడు వరుణ్ మేర్ల పాక గాంధీ కూడా ఇదే స్ట్రాటజీని అప్లై చేశారు. కమెడియన్ సత్యతో కలిసి.. ఓ వీడియో గ్లింప్స్‌ ను రిలీజ్ చేశారు. ఈ వీడియో హిలయరస్‌గా ఉంది. సినిమా ఏ జానర్లో తెరకెక్కుతుందో.. అందరికీ తెలిసేలా చేస్తోంది. దాంతో పాటే సినిమాపై బజ్‌ ను కూడా క్రియేట్ చేస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Charan: దిమ్మతిరిగే న్యూస్ ! ఫ్యాన్స్‌కు చరణ్‌ బిగ్ సర్‌ప్రైజ్

TOP 9 ET News: డబుల్‌ కా మీటా! ఇది కదా బర్త్‌ డే బంప్స్‌ అంటే!

Court: సంచలనంగా కలెక్షన్స్‌.. రూ.50 కోట్ల క్లబ్‌లో కోర్టు మూవీ

Manchu Lakshmi: ఓ ఫ్యామిలీని బాధపెట్టారు.. క్షమాపణలు చెప్పాల్సిందే..