మీరు మూర్ఖులైతే ఈ సినిమాను OTTలో చూడండి

|

Jan 04, 2025 | 11:31 AM

తన సినిమా బిగినింగ్‌లోనే మీరు మూర్ఖులైతే ఈ సినిమా మొత్తం చూడండి అంటూ.. వార్నింగ్ ఇచ్చి మరీ క్రేజీగా తన సినిమా మొదలెట్టిన ఉపేంద్ర.. తన స్టోరీ టెల్లింగ్‌తో అందర్నీ మరో సారి ఆకట్టుకున్నాడు. ఆకట్టుకోవడమే కాదు నెట్టింట చిన్న పాటి అల్లకల్లోలాన్నే సృష్టించాడు. మొత్తానికి డీసెంట్‌ హిట్‌ తో పాటు.. మంచి కలెక్షన్స్‌ను కూడా పట్టేశాడు.

అయితే ఉపేంద్ర మాస్టర్ పీస్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. ఇదే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది.స్ట్రీమింగ్ మొదలు కాకముందే మీరు మూర్ఖులైతే ఈ సినిమాను ఓటీటీలో చూడండి అనే కామెంట్ క్రేజీగా వస్తోంది నెట్టింట. ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన సినిమా యూఐ. రిలీజ్ కు ముందే ఆసక్తిరేపిన ఈ సినిమా డిసెంబర్ 20న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా విడుదలైంది. ఇక ఇప్పుడు యూఐ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్ట్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. సినిమా స్ట్రీమింగ్ గురించి సన్‌నెక్స్ట్ ఎలాంటి సోషల్ మీడియా పోస్ట్‌లను షేర్ చేయనప్పటికీ, మరికొద్ది రోజుల్లో యూఐ సినిమా సన్‌నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అలా చేస్తే మీ భార్య పారిపోతుంది.. వర్క్‌-లైఫ్ బ్యాలెన్స్‌పై అదానీ కామెంట్లు

ఓర్నీ !! భక్తితో గుడికొచ్చాడనుకుంటే.. దేవుడికే ఎసరు పెట్టాడుగా..!

Daaku Maharaaj: డాకు మహరాజ్‌లో అదిరిపోయే ఫైట్స్‌.. ముందెన్నడూ చూడని విధంగా

గడ్డకట్టిన చెరువులో యువతి నిర్వాకం.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

చైనాలో మరో అద్భుతం.. మరో భారీ ప్రాజెక్టును ప్రారంభం