అశ్లీల చిత్రాలపై ఉక్కుపాదం! OTTలపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

Updated on: Jul 27, 2025 | 6:10 PM

ఓటీటీల్లో అశ్లీల కంటెంట్ ఎక్కువవుతోందనే కామెంట్ ఉంది. అందులోకే కొన్ని ఓటీటీ ఛానెల్స్‌ అయితే సాఫ్ట్ పోర్న్‌ కంటెంట్‌నే ప్రధానంగా స్ట్రీమింగ్ చేస్తాయి. దీంతో ఇలాంటి ఓటీటీ ఛానెల్స్‌ను కంట్రోల్ చేయాలని.. వీలైతే బ్యాన్ చేయాలనే డిమాండ్‌ జనాల్లో మొదలైంది. ఇప్పుడు జనాల డిమాండ్‌ను పరిగనలోకి తీసుకన్న కేంద్ర ప్రభుత్వం.. అశ్లీల కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేస్తున్న ఓటీటీలపై సంచలన నిర్ణయం తీసుకుంది.

అడల్ట్ కంటెంట్ ను ఎక్కువగా పబ్లిష్ చేస్తున్న ఉల్లూ సహా 25 రకాల యాప్స్, వెబ్ సైట్లను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఆ యాప్స్, వెబ్ సైట్స్ అందుబాటులో ఉండకుండా బ్యాన్‌ చేయాలని ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌కు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం బ్యాన్ చేసిన వాటిల్లో ఉల్లూ, ALTT,బిగ్‌ షాట్స్‌ యాప్‌, దేశీఫ్లెక్స్‌, బూమెక్స్‌, నవరసా లైట్‌, గులాబ్‌ యాప్‌, కంగన్‌ యాప్‌, బుల్‌ యాప్‌, జల్వా యాప్‌, వావ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, లుక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, హిట్‌ప్రైమ్‌, ఫెనియో, షో ఎక్స్‌, సోల్‌ టాకీస్‌, అడ్డా టీవీ, హాట్‌ఎక్స్‌ VIP, హల్‌చల్‌ యాప్‌, మూడ్‌ఎక్స్‌, నియోన్‌ ఎక్స్‌ VIP, ఫూగీ, మోజ్‌ఫ్లిక్స్‌, ట్రిఫ్లిక్స్‌ లాంటివి ఉన్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Balakrishna: మా బాలయ్య బంగారం! అభిమాని కష్టం ఎరిగి.. సాయం చేసిన బాలయ్య