మంచు వారి పప్పు! చిక్కగా.. చక్కగా…
పప్పు లేకుండా తెలుగింటి భోజనానికి నిండుదనం రాదు. ఆ రుచిని మరిచిపోలేం. అలాంటి పప్పుకు మోహన్ బాబు మరో పేరు పెట్టారు. ఈ కారణంగానే ఇప్పుడు ఈయన త్రూ అవుట్ ఇండియా వైరల్ అవుతున్నారు. అక్రాస్ సోషల్ మీడియా మరోసారి క్రేజీ కామెంట్స్ వచ్చేలా చేసుకుంటున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే..! ఫుడ్ వ్లాగ్స్ చేస్తూ.. యూట్యూబ్‌లో పాపులర్ అయిన కమియా జానీ.. తాజాగా మోహన్ బాబుతోనూ ఓ ఫుడ్ వ్లాగ్ చేశారు.
జల్ పల్లిలోని ఆయన ఇంటికి వెళ్లి.. ఆయనతో కలిసి రకరకాల వంటకాలను ఆస్వాదించారు. దాంతో పాటే ఆయనకు ఇష్టమైన వంటకాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు.. తనకు పప్పు ఇష్టమని.. అది కూడా మంచు వారి పప్పు ఇష్టమంటూ చెప్పారు. పప్పు అందరూ చేస్తారని.. కానీ తన ఇంట్లో లాంటి పప్పు టేస్ట్ ఎక్కడా దొరకదని.. అందుకే తన ఇంటి పేరునే తన పప్పుకు పెట్టా అంటూ చెప్పారు. అంతేకాదు మా ఇంట్లో చేసిన మంచు వారి పప్పును కొంచెం టేస్ట్ చేస్తే చాలు… మొత్తం లాంగించేదాకా వదలవ్ అంటూ.. యాంకర్‌తో సరదాగా కోట్ చేశారు. అయితే మంచు మోహన్ బాబు చేసిన ఈ కామెంట్సే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దాంతో పాటు పప్పుకు తన ఇంటి పేరు జోడించడం నెట్టింట క్రేజీ రియాక్షన్స్‌కు కారణం అవుతోంది. మరోసారి ఈయన పై ట్రోల్స్ అండ్ మీమ్స్ వచ్చేలా చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అశ్లీల చిత్రాలపై ఉక్కుపాదం! OTTలపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
Balakrishna: మా బాలయ్య బంగారం! అభిమాని కష్టం ఎరిగి.. సాయం చేసిన బాలయ్య
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
ప్రశాంతమైన మరణానికి మార్గం సుగమం!!
రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్!
ఈసీజీ కూడా కనిపెట్టలేనిది.. ఏఐ కనిపెట్టేసిందిగా!

