విరాట్ కోహ్లీని అచ్చుగుద్దిన తుర్కియే నటుడు.. వైరల్‌ అవుతున్న ఫోటో

Updated on: Apr 02, 2025 | 3:12 PM

మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అంటారు.. ఇది ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే.. అచ్చం మన స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీని పోలిన మరో వ్యక్తి గురించి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే.. ఇంతకు ముందు కూడా కోహ్లీని పోలిన మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు వార్తలు, ఫోటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి.

తాజాగా తుర్కియే నటుడు కావిట్ సెటిన్ గునెర్ అచ్చుగుద్దినట్టుగా కోహ్లీని పోలి ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇదంతా చూస్తుంటే ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారన్న నానుడి నిజమే అనిపిస్తోంది. మిగతా నలుగురు కూడా ఎక్కడో అక్కడ ఉండే ఉంటారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలో కాన్పూర్ వేదికగా భారత్ – బంగ్లాదేశ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో అచ్చం కోహ్లీలా ఉన్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కార్తీక్ శర్మ.. విరాట్ కోహ్లీతో సెల్ఫీ దిగాడు. ఆ తర్వాత ఆయోధ్య బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న సమయంలో కోహ్లీని పోలిన వ్యక్తి కనిపించాడు. తాజాగా అచ్చం కోహ్లీలా ఉండే వ్యక్తి తారసపడటం విశేషం. అతడే తుర్కియేకు చెందిన నటుడు సెటిన్ గునెర్. తుర్కియేలో ప్రఖ్యాత సిరీస్ దిరిలిస్ ఎర్టుగ్రుల్‌లో కావిట్ సెటిన్ నటించాడు. ఆ సిరీస్‌లోని ఒక సన్నివేశంలో కావిట్ ఉన్న స్క్రీన్ షాట్‌ను ఓ సోషల్ మీడియా యూజర్‌ షేర్ చేశాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ కోడి కబాబ్ తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే

బ్రతికించలేమని వైద్యులు చేతులెత్తేశారు.. నేనున్నా అంటూ ప్రాణం పోసిన ‘ఏఐ’