Guntur Kaaram: వావ్ వాటే సాంగ్.! హిట్టు అంతే.! ఊపందుకున్న గుంటూరు కారం.

|

Dec 15, 2023 | 8:53 AM

మోస్ట్ అవైటెడ్ మూవీ ‘గుంటూరు కారం’. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే విడుదలైన మహేష్ లుక్.. గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ఇక కొద్ది రోజుల క్రితం విడుదలైన దమ్ మసాలా పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్, యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు.

మోస్ట్ అవైటెడ్ మూవీ ‘గుంటూరు కారం’. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే విడుదలైన మహేష్ లుక్.. గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ఇక కొద్ది రోజుల క్రితం విడుదలైన దమ్ మసాలా పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్, యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ఇందులో శ్రీలీల , మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడ్డ ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ క్రమంలో ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ సైతం స్టార్ట్ చేశారు. ఇప్పటికే దమ్ మసాలా సాంగ్ రిలీజ్ చేయగా..ఇప్పుడు మరో పాటను అడియన్స్ ముందుకు తీసుకువచ్చారు.

గుంటూరు కారం సినిమా నుంచి ఓ మై బేబీ అంటూ సాగే పాటను కాసేపటి క్రితం విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. శిల్పా రావు ఆలపించారు. “నా కాఫీ కప్పులో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే.. నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే.. నా చెంపలకంటిన చామంతి సిగ్గు నువ్వే నువ్వే.. నా ఊపిరి గాలిని పర్ఫ్యూమ్ అల్లే చుట్టేస్తావే.. ఓ మై బేబీ” అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ చేయనున్నారు. ఇందులో జగపతి బాబు కీలకపాత్రలో నటిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.