అల్లుడి ముచ్చట చెబుతూ అత్త మాస్‌ సాంగ్‌ !! షేక్ అవుతున్న సోషల్ మీడియా

Updated on: Jan 01, 2026 | 12:53 PM

"చిక్కెనే తెత్తడు నా అల్లుడు" పాట ప్రస్తుతం యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ తెలంగాణ ఫోక్ సాంగ్ దేశవ్యాప్తంగా యువతను, పెద్దలను అలరిస్తోంది. మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న ఈ గీతం పెళ్లిళ్లు, పార్టీలు, నూతన సంవత్సర వేడుకల్లో మార్మోగుతోంది. ప్రభ గాత్రం, కళ్యాణ్ కీస్ సంగీతం, అంజి పీట్ల సాహిత్యం ఈ విజయానికి కారణం.

ఇటీవల కాలంలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. పెళ్లి బరాత్ నుంచి బర్త్ డే పార్టీస్ వరకు.. ప్రతి చిన్న వేడుకలో ఈ ఫోక్ సాంగ్సే మార్మోగిపోతున్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందర్నీ ఊపేస్తూ.. ఊర మాస్ స్టెప్పులు వేసేలా చేస్తున్నాయి. ఇప్పుడు అలాంటి మరో ఫోక్ సాంగే యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తోంది. చిక్కెనే తెత్తడు నా అల్లుడు.. అంటూ ఈ ఫోక్ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ ను ఊపేస్తుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదిరిపోయే మాస్ బీట్, మాస్ స్టెప్పులతో మ్యూజిక్ లవర్స్‌కు భలే కిక్ ఇస్తోంది. మిలియన్‌ల కొద్దీ వ్యూస్‌ను సొంతం చేసుకుంటోంది. అంతేకాదు సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్స్టాలఅయితే ఈ సాంగ్‌ విపరీతంగా వైరల్ అవుతోంది. చిన్నా పెద్దా..అందరూ ఈ సాంగ్‌ను రీల్ చేస్తూ.. ఎంజాయ్ చేస్తున్నారు. అందులోనూ ఇయర్ ఎండ్ .. న్యూస్ ఇయర్ బిగినింగ్ వేళ.. ఈ పాట పెట్టుకుని రచ్చ చేస్తున్నారు. ఇక ఈ పాటకు అంజి పీట్ల సాహిత్యం అందించగా.. కళ్యాణ్ కీస్ సంగీతం అందించారు. ఫోక్ సింగర్ ప్రభ మరోసారి తన గాత్రంతో అదరగొట్టింది. శేఖర్ వైరస్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో ప్రియ- రుచిత అదిరిపోయేలా మాస్ స్టెప్పులు వేసి అందర్నీ ఆకట్టుకున్నారు. నాలుగు నిమిషాల మూడు సెకన్లు ఉన్న ఈ పాట.. చూస్తుంటే బొంబాయికి రాను తరహాలో సెన్సేషన్ అయ్యేలా కనిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bunny Vas: ఆ ఒక్క సినిమా వల్ల ఏకంగా 6 కోట్లు నష్టపోయా

Director Maruthi: ఈవెంట్లో అడ్రస్ చెప్పిన పాపానికి మారుతికి స్వీట్ షాకిచ్చిన అభిమాని

Sravana Bhargavi: మొన్న ఆయన.. ఇప్పుడు ఈమె !! అసలు విషయం దాస్తూ.. షాకింగ్ కామెంట్స్

Naa Anveshana: అన్వేష్‌పై BNS సెక్షన్‌.. ఇండియాకొస్తే బొక్కలోకే