Sharwanand: న్యూ ఏజ్ క్రైమ్ కామెడీకి.. రిబ్బన్ కట్ చేసిన శర్వా..
గుణి మణికంటి దర్శకత్వంలో, చిత్రాలయ స్టూడియోస్ నిర్మించిన 'బా బా బ్లాక్ షీప్' క్రైమ్ కామెడీ చిత్రం టీజర్ విడుదలైంది. ఒక రోజులో ఆరుగురి జీవితాల్లో జరిగే సంఘటనల చుట్టూ అల్లుకున్న ఈ న్యూ ఏజ్ సినిమాను హీరో శర్వానంద్ లాంచ్ చేసి ప్రశంసించారు. కామెడీ, క్రైమ్, హారర్‌ల మిశ్రమంతో దూసుకుపోతున్న టాలీవుడ్ ట్రెండ్‌లో ఈ చిత్రం భాగం.
ఈ మధ్య కామెడీని క్రైమ్‌తో, హర్రర్‌తో బ్లెండ్ చేసి మంచి హిట్స్ కొడుతున్నారు మన టాలీవుడ్ డైరెక్టర్లు. కమర్షియల్‌గా కలెక్షన్స్‌ను నొక్కేస్తూ టాలీవుడ్‌లో దూసుకుపోతున్నారు. ఇప్పుడు యంగ్ డైరెక్టర్ గుణి మంచి కంటి కూడా అదే ప్రయత్నంతో మన ముందుకు వస్తున్నాయి. ఈక్రమంలోనే తన సినిమా టీజర్‌ను హీరో శర్వాతో రిబ్బన్ కట్ చేయింది… శర్వాను కూడా ఇంప్రెస్ చేసేశాడు. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ లీడ్ రోల్లో.. డైరెక్టర్ గుణి మంచి కంటి డైరెక్షన్లో.. చిత్రాలయ స్టూడియోస్ నిర్మిస్తున్న సినిమా ‘బా.. బా.. బ్లాక్ షీప్’. ఒక రోజు జరిగిన అనుకోని ఓ ఘటనతో 6 వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ సినిమా ఇది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను ఛార్మింగ్ హీరో శర్వానంద్ యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. రిలీజ్ చేడమే కాదు.. టీజర్‌ను చూసి ఎంజాయ్ చేశారు. ఈ మూవీ టీంను మెచ్చుకున్నాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Akira Nandan: తండ్రిని ఫాలో అవుతూ.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పవన్ కొడుకు
పోలీసుల కళ్ళకు ఏఐ గ్లాసెస్.. క్షణాల్లో వారిని పట్టేస్తుంది
Kashmir: భూతల స్వర్గం.. కశ్మీర్ సొగసు చూడతరమా
