హీరోయిన్స్ విషయంలో సస్పెన్స్
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లు ఇతర భాషల్లో బిజీ అవ్వడంతో కొత్త అమ్మాయిల హవా పెరుగుతోంది. అప్ కమింగ్ క్రేజీ ప్రాజెక్ట్‌లలో యంగ్ బ్యూటీస్ కనిపించినా, వారి ఎంపికపై అధికారిక ప్రకటనలు వెలువడటం లేదు. నాని, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ల విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది.
స్టార్ హీరోయిన్లు ఇతర భాషా చిత్రాలతో బిజీగా ఉండటంతో, టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్ల జోరు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, రాబోయే ముఖ్యమైన చిత్రాలలో యంగ్ బ్యూటీస్ నటిస్తారనే వార్తలు వైరల్‌గా మారుతున్నప్పటికీ, వాటిపై అధికారిక ప్రకటనలు మాత్రం వెలువడటం లేదు. వరుస విజయాలతో దూసుకుపోతున్న నాచురల్ స్టార్ నాని నటిస్తున్న ది పారాడైజ్ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఫేమ్ కయాదు లోహర్ నానికి జోడిగా నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అరడజన్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్, యంగ్ సెన్సేషన్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా భాగ్యశ్రీ బోరుసేని తీసుకునే ఆలోచనలో మూవీ టీమ్ ఉన్నట్లు సమాచారం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మూలవిరాట్ ను తాకిన సూర్యకిరణాలు
అంగరంగ వైభవంగా సాగుతున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన పసికూన
