8 వారాల OTT రూల్.. మునిగిపోయేది నిర్మాతలే
బాలీవుడ్‌లో 8 వారాల OTT విండో విజయవంతంగా అమలవుతుండగా, టాలీవుడ్‌లో ఇది ఎందుకు సాధ్యం కావడం లేదు? నార్త్‌లో ఎగ్జిబిటర్లు వేరు, నిర్మాతలు వేరు కావడంతో మల్టీప్లెక్స్‌లు ఈ నియమాన్ని కఠినంగా పాటిస్తాయి. కానీ టాలీవుడ్‌లో ఎగ్జిబిటర్లే నిర్మాతలు కావడంతో 8 వారాల విండో వల్ల OTT ఆదాయం భారీగా తగ్గుతుందని, పైరసీ, సినిమా ఫ్లాప్ రిస్క్ వంటి కారణాలతో 30 రోజుల విండోకే మొగ్గు చూపుతున్నారు. దీని వెనుక ఉన్న బిజినెస్ రహస్యాలను ఈ కథనంలో చూద్దాం.
బాలీవుడ్‌లో సక్సెస్ అయిన 8 వారాల ఓటీటీ విండో రూల్.. టాలీవుడ్‌లో ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు..? అక్కడ 50 రోజుల తర్వాత ఓటిటిలో విడుదలవుతున్న సినిమా.. ఇక్కడెందుకు 30 రోజుల్లోపే వచ్చేస్తుంది..? అసలు ఈ 8 వారాల లెక్కల వెనుకున్న బిజినెస్ సీక్రెట్స్ ఏంటి..? డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వందల కోట్ల డీల్స్ వెనక మ్యాటర్ ఏంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దాం పదండి.. బాలీవుడ్‌లో ఏ సినిమా అయినా 8 వారాల తర్వాతే ఓటిటిలోకి వస్తుంది.. ఈ రూల్ బ్రేక్ చేస్తే మల్టీప్లెక్స్ వాళ్లు స్క్రీన్స్ ఇవ్వరు. పైగా వాళ్ల చేతుల్లోనే 60 నుంచి 75 శాతం థియెట్రికల్ రెవెన్యూ ఉంటుంది కాబట్టి ఎదురుండదు. నార్త్‌లో ఎగ్జిబిటర్లు వేరు.. నిర్మాతలు వేరు కావడంతో 8 వారాల రూల్‌ను మల్టీప్లెక్స్‌లు స్ట్రిక్ట్‌గా అమలు చేస్తున్నాయి. కాబట్టే లాంగ్ రన్ సాధ్యమవుతుంది. టాలీవుడ్‌కి వచ్చేసరికి సీన్ రివర్స్.. ఇక్కడ ఏషియన్ సినిమాస్, SVC, UV సెల్యులాయిడ్, మైత్రీ లాంటి వాళ్ళే ఎగ్జిబిటర్స్ కమ్ నిర్మాతలుగా ఉన్నారు. ఒకవేళ 8 వారాల రూల్ పెడితే.. ఓటీటీ నుంచి నిర్మాతగా తమకు వచ్చే భారీ ఆదాయాన్ని వాళ్లే స్వయంగా వదులుకోవాల్సి వస్తుంది. అందుకే తమకు తామే నష్టం చేసుకునే ఈ 8 వారాల డీల్‌పై పొత్తు కుదరట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్.. ఓ పెద్ద సినిమాకు 4 వారాల విండో అయితే 100 కోట్ల ఆఫర్ ఇచ్చే ఓటిటి సంస్థలు.. 8 వారాలకు మార్చితే ఆ రేటును సగానికి తగ్గిస్తారు. సినిమా హిట్టైతే ఓకే కానీ ఫ్లాపైతే నిర్మాతలకు 50 కోట్లు నష్టమేగా..! ఈ రిస్క్ తీసుకోలేకే మన ఎగ్జిబిటర్స్ కమ్ ప్రొడ్యూసర్స్ ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. పైగా బాలీవుడ్‌లో ఫ్లెక్సీ టికెట్ రేట్లుంటే.. మన దగ్గర భారీగా పెంచేస్తుంటారు. పైరసీ విలయతాండవం చేస్తున్న ఈ రోజుల్లో.. 8 వారాల పాటు ఫుట్ ఫాల్స్ ఉంటాయన్న గ్యారెంటీ లేదు. ఈ రిస్క్ అంతా ఎందుకనే సేఫ్‌గా 4 వారాల విండోకే ఓటేస్తున్నారు మన నిర్మాతలు. నార్త్‌లో సక్సెస్ అయిన ఈ ఓటీటీ ఫార్ములా.. టాలీవుడ్ బిజినెస్ మోడల్‌కు సెట్టవ్వట్లేదు. ఇన్ని కారణాలున్నాయి కాబట్టే తెలుగులో ఎంత పెద్ద సినిమా అయినా నెల రోజుల్లోపే ఓటిటిలో వచ్చేస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Anil Ravipudi: దగ్గుబాటితో నందమూరి.. అనిల్ ప్లాన్ అదుర్స్
Ram Pothineni: వరుస ఫెయిల్యూర్స్ తో.. కన్‌ఫ్యూజ్ అవుతున్న రామ్ పోతినేని
Samyuktha Menon: LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
Suriya: కోలీవుడ్ టు టాలీవుడ్.. హిట్ కోసం సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా