TOP 9 ET: దేశ చరిత్రలోనే మొట్ట మొదటి సారి | ఆ ఆంజనేయుడు వస్తారనే నమ్మకం..!
పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఉస్తాద్ భగత్‌సింగ్. శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ వేగాన్ని పెంచారు. త్వరలో హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్ ప్రారంభం కానుంది.
01.usthaad
పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఉస్తాద్ భగత్‌సింగ్. శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ వేగాన్ని పెంచారు. త్వరలో హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఆర్ట్ డైరక్టర్ ఆనంద్‌సాయి పర్యవేక్షణలో ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో పవన్‌తో పాటు మెయిన్ స్టార్ కాస్ట్ అంతా పాల్గొంటారు.
02. avara
కార్తి, తమన్నా జంటగా నటించిన సినిమా ఆవారా. మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా అప్పట్లో భారీ హిట్ అయిన ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే ప్రయత్నం మొదలెట్టారట డైరెక్టర్ లింగుస్వామి. అయితే ఈ సీక్వెల్‌లో ఆర్య నటిస్తారనే టాక్ కోలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది.
03.satya premki
కార్తిక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా నటించిన సినిమా సత్యప్రేమ్‌కీ కథ. మోస్ట్ అవేటెడ్ మూవీగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈసినిమా నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వడమే కాదు.. అందర్నీ ఆకట్టుకుంటూ.. నార్త్ మీడియాలో ట్రెండ్ అయి పోతోంది.
04.Saithan
క్రైమ్ కంటెంట్‌ని, వెబ్‌సీరీస్‌ని ఇష్టపడే వారిని ఉద్దేశించి సైతాన్‌ని తెరకెక్కించినట్టు డైరక్టర్ మహి.వి.రాఘవ్ తెలిపారు. మోషన్ పోస్టర్‌కి, ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చిందని, కథలో ఇంటెన్సిటీని వ్యక్తపరిచే భాషని సీరీస్‌లో వాడామని అన్నారు. వెన్నులో వణుకు పుట్టించే సన్నివేశాలు ఇందులో ఉంటాయని చెప్పారు ఆయన.
05. Maidhan
అజయ్ దేవ్‌గణ్ నటించిన సినిమా మైదాన్ సినిమా మరో సారి వాయిదా పడింది. ది మోస్ట్ అవేటెడ్ మూవీగా భారీ బడ్జెట్తో ఎప్పటి నుంచో తెరెకెక్కతున్న ఈ మూవీ… ఇప్పటికే ఏడు సార్లు వాయిదా పడింది. అయితే ఇటీవల ఈ మూవీని ఈ నెల 23న విడుదల చేస్తామని మేకర్స్ కాస్త గట్టిగానే చెప్పినప్పటికీ.. మరో సారి పోస్ట్ అవుతుందంటూ.. బీటౌన్ నుంచి ఓ న్యూస్ బయటికి వచ్చి.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
06.Prabhas
ఆదిపురుష్ ఈవెంట్ కోసం తిరుమల తిరుపతికి జూన్ 5 అర్థరాత్రే చేరుకున్న ప్రభాస్… తెల్లారుజాము ఉదయమే ఆ వేంకటేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. తన టీంతో కలిసి… స్వామి వారి సన్నిధిలో కాసేపు గడిపారు. అయితే ప్రభాస్‌ను చూసేందుకు భక్తులందరూ ఎగబడ్డారు.
07.China jEEYAR
ప్రభాస్ ఆదిపురుష్ ఈవెంట్‌కు చినజీయర్ స్వామి.. చీఫ్ గెస్ట్ గా రావడం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇలాంటి ఈవెంట్లకు దూరంగా ఉండే చినజీయర్ గతంలో నాగార్జున అన్నమయ్య ఈవెంట్‌కు కూడా చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు. అయితే ఆ ఈవెంట్‌కు సబంధించిన ఫోటోలు ఇప్పుడు ట్విట్టర్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి.
08. Hologram
ఆదిపురుష్ ఈవెంట్‌లో హోలోగ్రామ్ పోస్టర్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలువనుంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా 50 అడుగుల హోలోగ్రామ్ పోస్టర్‌ను ఈ ఈవెంట్‌లో ప్రదర్శించబోతున్నారు. అయితే ఈ పోస్టర్‌లో ప్రభాస్ ఏ లుక్‌లో కనిపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు రివీల్ అయిన లుక్‌లోనే పోస్టర్ డిజైన్ చేశారా? లేక మరో కొత్త లుక్‌ను రివీల్ చేస్తారా..? అన్నది తెలుసుకునేందుకు అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
09. Hanuman – హనుమంతుడికి ఒక సీట్
ఆదిపురుష్ సినిమా ప్రదర్శించే ప్రతీ థియేటర్లోనూ ఒక సీటును హనుమంతుడి కోసం రిజర్వ్ చేస్తున్నారు. రామ నామం వినిపించే ప్రతీ చోట హనుమంతుడు కొలువై ఉంటాడని హిందువుల నమ్మకం. అందుకే ఆదిపురుష్ థియేటర్లలో ప్రతీ షోకు ఓ సీటును హనుమంతుడి కోసం కేటాయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అఫీషియల్‌గా ఎనౌన్స్ చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.