TOP9 ET: ఇంతకీ NTR వస్తున్నారా.? లేదా.? | ఈ ఇద్దరూ కొరకరాని కొయ్యలు.!

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు, సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా జరగనున్నాయి. ఈ వేడుకలకు టాలీవుడ్‌ టాప్ స్టార్స్‌తో.. పాటు.. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వస్తున్నారు. మరి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉంటారా? లేదా? అనే కొశ్చన్ నెట్టింట వస్తోంది. ఎన్టీఆర్ వస్తే ఆ వేడుక మరింత కన్నుల పండగగా మారుతుందని..

TOP9 ET: ఇంతకీ NTR వస్తున్నారా.? లేదా.? | ఈ ఇద్దరూ కొరకరాని కొయ్యలు.!

|

Updated on: Sep 01, 2024 | 1:15 PM

01.NTR: ఇంతకీ NTR వస్తున్నారా.? లేదా.?

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు, సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా జరగనున్నాయి. ఈ వేడుకలకు టాలీవుడ్‌ టాప్ స్టార్స్‌తో.. పాటు.. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వస్తున్నారు. మరి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉంటారా? లేదా? అనే కొశ్చన్ నెట్టింట వస్తోంది. ఎన్టీఆర్ వస్తే ఆ వేడుక మరింత కన్నుల పండగగా మారుతుందని.. నందమూరి అభిమానుల్లో మరింతగా ఆనందం వెల్లివిరుస్తుందనే కామెంట్ సోషల్ మీడియాలో కనిపిస్తోంది.

02.NTR, Allu Arjun: ఈ ఇద్దరూ కొరకరాని కొయ్యలు.!

టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్… ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌లు కొరకరాని కొయ్యలుగా మారిపోయారు. పర్ఫెక్ట్ క్వాలిటీ.. నో కాంప్రమైజ్‌ పాలసీతో.. తమ సినిమాలను చెక్కుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఎవ్వరు ఇబ్బంది పడినా.. డేంట్‌ కేర్ అని దూసుకుపోతున్నారు. ఓ పక్క యంగ్ టైగర్ దేవర సినిమాను బ్లాక్ బాస్టర్ చేయాలనే కసితో.. ఈ సినిమా కోసం పని చేస్తుండగా.. మరో పక్క ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2ను ఎక్స్‌స్ట్రీమ్‌ లెవల్లో సిల్వర్ స్క్రీన్‌ పైకి తీసుకొచ్చేందుకు ఎక్స్‌ట్రా కాల్షీట్లు కేటాయించి మరీ కష్టపడుతున్నారు. ఇక వీరి డెడికేషన్‌తో.. కష్ట పడే తీరుతో.. సినిమాను ఎలాగైనా హిట్టుగా మార్చాలనే మొండితనంతో ఇండస్ట్రీలో బజ్ చేస్తున్నారు.

03.Mohanlala: అప్పటి వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్..

ఓ పక్క హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తున్న వేళ.. మలయాళ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మోహన్ లాల్ త్రో బ్యాక్ అసభ్యకర వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇక అప్పట్లో ఓ అవార్డ్‌ ఫంక్షన్ వెళ్లిన మోహన్ లాల్‌.. తన కో స్టార్ వేదికపై అవార్డ్‌ తీసుకుంటుండగా… ఆ కోస్టార్‌ను చూస్తూ.. చేతులతో అసభ్యంగా సైగలు చేశారు. ఆ సైగలను మోహన్ లాల్ పక్కనే ఉన్న మలయాళ స్టార్ మమ్మట్టి కూడా చూసి పగలబడి నవ్వారు. అయితే ఇది కాస్తా ఆ ఈవెంట్‌ కెమెరాలో రికార్డ్‌ అవ్వడం అది బయటికి రావడం అప్పట్లో సంచలనంగా మారింది. మోహన్ లాల్, మమ్ముట్టి తీరును అందరూ విమర్శించేలా చేసింది. అప్పటి నుంచి.. ఇప్పటి వరకు అక్రాస్ సోషల్ మీడియా వైరల్ అవుతూనే ఉంది. ఇప్పుడు మరో సారి అది హాట్‌ వీడియోగా సోషల్ మీడియాలో మారింది.

04.Mahesh Babu: నా కొడుకును చూసి ఎంతో గర్విస్తున్నా.!

సినిమాలతో పాటే.. తన ఫ్యామిలికి కూడా స్పెషల్ స్పేస్ ఇచ్చే మహేష్ బాబు.. తాజాగా తన కొడుకు గౌతమ్ గురించి ఎమోషనల్ ట్వీట్‌ చేశారు. 31st ఆగస్ట్‌ గౌతమ్‌ బర్త్‌ డే కావడంతో.. హ్యాపీ 18 మై సన్‌ అంటూ విష్ చేశారు మహేష్. జీవితంలో ఎన్నో కొత్త విషయాలను అన్వేషించాలని.. ఎంజాయ్‌ చేయాలని చెప్పారు. తన కొడుకును ఎంతో ప్రేమిస్తున్నా అని.. ఓ తండ్రిగా గౌతమ్‌ను చూసి ఎంతో గర్వంగా.. ఆనందంగా ఉన్నా అంటూ.. ఎమోషనల్‌గా తన ట్వీట్లో రాసుకొచ్చారు మన సూపర్ స్టార్.

05.NTR: అమ్మ కోరిక తీర్చిన యంగ్ టైగర్.

అమ్మను అమితంగా ప్రేమించే యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన అమ్మ షాలినీ చిరకాల కోరికను తీర్చారు. తన కొడుకు ఎన్టీఆర్‌ను.. తన స్వగ్రామం కుందాపురానికి తీసుకొచ్చి శ్రీకృష్ణుడిని దర్శించుకోవాలని.. ఎన్టీఆర్ తల్లి ఆశపడ్డారు. ఇక ఇది గ్రహించిన యంగ్ టైగర్ కుంటుంబ సమేతంగా వచ్చి ఉడిపిలోని శ్రీకృష్ణుడి మఠాన్ని దర్శించుకున్నారు. తన తల్లి బర్త్‌ డే ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో చెప్పారు. సెప్టెంబర్‌ 2న తన తల్లి బర్త్‌ డే కి తాను ఇచ్చే ఉత్తమమైన బహుమతి ఇదే అని.. తన చిరకాల కోరిక తీర్చడమే అంటూ.. రాసుకొచ్చారు.

06.Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.

మరో రెండు రోజుల్లో … తెలుగు టూ స్టేట్స్‌లో పవన్‌ బర్త్‌ డే సందర్భంగా అంబరాన్ని అంటే.. సంబరాలు జరగనున్న వేళ.. ఓ కిక్కిచ్చే న్యూస్ బయటికి వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ మోస్ట్ అవేటెడ్ మూవీ ఓజీ నుంచి.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవనుందనే అప్డేట్ మేకర్స్‌ నుంచి అఫీషియల్‌గా వచ్చింది. దీంతో పవన్ ఫ్యాన్స్‌ పిచ్చ హ్యాపీగా ఫీలవుతున్నాయి. ఓజీ మానియాను.. సోషల్ మీడియాలో ఓ చేంజ్‌లో స్ప్రెడ్ చేస్తున్నారు.

07.Pawan Kalyan: పవన్‌ సినిమా తీసుకోడానికి భయపడుతున్న థియేటర్ ఓనర్స్.

పవన్ సినిమా వస్తే చాలు.. ఫ్యాన్స్‌కే కాదు.. థియేటర్ల ఓనర్లు కూడా పండగలా ఫీలవుతారు. తమ థియేటర్ల ముందు హౌస్‌ ఫుల్ బోర్డులు పడడం చూసి.. టికెట్లు తెగడం చూసి.. కుప్పులు తెప్పులుగా డబ్బులు రావడం చూసి.. ఎగిరిగంతేస్తుంటారు. అలాంటి థియేటర్ ఓనర్స్ అండ్ ఎగ్జిబిటర్లే ఇప్పుడు యూ టర్న్‌ తీసుకున్నారని తెలుస్తోంది. పవన్ సినిమాను స్క్రీనింగ్ చేస్తే తన సినిమా థియేటర్‌ డ్యామేజ్ అవుతుందని థియేటర్ ఓనర్స్ జంకుతున్నారనే న్యూస్ బయటికి వచ్చింది. పవన్ బర్త్‌ డే సందర్భంగా గబ్బర్ సింగ్ రీ రిలీజ్‌కు అవుతున్న వేళ.. థియేటర్లను ఇచ్చేందుకు వీళ్లు భయపడుతున్నారనే టాక్ ఫిల్మ్ సర్కిల్లో హాట్ టాపిక్ అవుతోంది.

08.nani: హాలీవుడ్‌లో కలెక్షన్స్ కుమ్మేస్తున్న నాని.

నేమ్ ఈజ్‌ నాని.. హాలీవుడ్‌ ఫీల్డ్‌లో అదరగొడుతున్నాడు. నార్త్‌ అమెరికా రీజన్లో తన సరిపోదా శనివారం సినిమాతో.. సరిపోయిన దానికంటే ఎక్కువ కలెక్షన్స్‌ను వచ్చేలా చేసుకుంటున్నారు. ఇక ఆల్‌ ఓవర్ వరల్డ్‌ ఇప్పటికే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ నాని మూవీ.. నార్త్ అమెరికాలో దాదాపు 1 మిలియన్ డాలర్ల కలోక్షన్స్‌ను కొల్లగొట్టింది. స్టిల్‌ మంచి వ్యూవర్‌ షిప్‌ తో రన్ అవుతోంది. కలెక్షన్స్‌లో మరిన్ని వండర్స్ క్రియేట్ అయ్యేలానే కనిపిస్తోంది.

09.Pawan Kalyan: కొద్దిలో తప్పించుకున్నాడు.. లేకుంటే ప్రాణాలు పోయేవి.!

మీడియా ముందుకు వస్తే చాలు.. ఎప్పుడూ ఏదో సంచలన విషయం చెప్పే బండ్ల గణేష్.. తాజాగా గబ్బర్ సింగ్ రిరిలీజ్ ఈవెంట్లో అలాంటి ఓ విషయమే చెప్పి పవన్ ఫ్యాన్స్‌కు చెమటలు పట్టేలా చేశాడు. గబ్బర్ సింగ్ సినిమాలో గుర్రం స్వారీ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో.. పవన్‌ వెనక్కి పడిపోయాడన్నాడు. కొద్దిలో ప్రాణాలు కూడా పోయేవని.. చెప్పి అందర్నీ షాకయ్యేలా చేశాడు.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us