TOP9 ET: చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | దిమ్మతిరిగేలా చేస్తున్న మహేష్‌ న్యూ లుక్.

|

Apr 20, 2024 | 8:12 AM

హీరోలను ఓ రేంజ్‌లో చూపించడంలో జక్కన్నే తోప్‌! అలాంటి జక్కన్న, ఎప్పుడూ రిజర్వర్డ్‌ లుక్‌లో ఉండే సూపర్ స్టార్ మహేష్‌ బాబును ఎలా చూపిస్తారనే కన్ఫూజన్ జనాల్లో ఉంది. అయితే ఈ కన్ఫూజన్ ఇప్పుడు తొలిగిపోయింది. లాంగ్‌ హెయిర్‌లో.. గడ్డంతో ఉన్న మహేష్‌ లుక్‌ చూసి జనాలు నుంచి సూపర్ అనే రియాక్షన్ వస్తోంది. మహేష్ లుక్ అదిరిపోయింది.. పిచ్చ పిచ్చగా నచ్చేసిందనే కామెంట్ కూడా నెట్టింట కనిపిస్తోంది.

01.mahesh: దిమ్మతిరిగేలా చేస్తున్న.. మహేష్‌ న్యూ లుక్.

హీరోలను ఓ రేంజ్‌లో చూపించడంలో జక్కన్నే తోప్‌! అలాంటి జక్కన్న, ఎప్పుడూ రిజర్వర్డ్‌ లుక్‌లో ఉండే సూపర్ స్టార్ మహేష్‌ బాబును ఎలా చూపిస్తారనే కన్ఫూజన్ జనాల్లో ఉంది. అయితే ఈ కన్ఫూజన్ ఇప్పుడు తొలిగిపోయింది. లాంగ్‌ హెయిర్‌లో.. గడ్డంతో ఉన్న మహేష్‌ లుక్‌ చూసి జనాలు నుంచి సూపర్ అనే రియాక్షన్ వస్తోంది. మహేష్ లుక్ అదిరిపోయింది.. పిచ్చ పిచ్చగా నచ్చేసిందనే కామెంట్ కూడా నెట్టింట కనిపిస్తోంది.

02.chiru: ప్రౌండ్‌ మూమెంట్.. చిరును కలిసిన మాస్కో సాంస్కృతిక బృందం.

రీసెంట్‌ డేస్లో ఫారెన్ నుంచి ఏ అఫీషియల్స్ వచ్చినా..చిరు ఇంటికి వెళ్లడం.. చిరును కలవడమే పనిగా పెట్టుకున్నారు. ఇక తాజాగా ఇండియాకి.. అందులోనూ హైద్రాబాద్‌కు వచ్చిన మాస్కో అఫీషియల్స్ అదే చేశారు. మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులైన కొంత మంది తాజాగా చిరుతో సమావేశమయ్యారు. రష్యాలో తెలుగు సినిమా షూటింగ్‌లు జరిపేందుకు పూర్తిగా సపోర్ట్ ఇవ్వనున్నట్టు వారు చిరుకు చెప్పడమే కాదు.. రెండు ఇండస్ట్రీలు కలిసి పని చేస్తే బాగుంటుందన్నారు.

03.ram charan: బాలీవుడ్‌లో.. చరణ్‌కు 70 కోట్లు, NTRకి 50 కోట్లు.

ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల థియేట్రికల్ రైట్స్‌కు నార్తలో మంచి డిమాండ్‌ ఏర్పడింది. ఇక ఈ క్రమంలోనే చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్‌ సినిమా రైట్స్‌కు నార్త్‌లో 70 కోట్ల రేట్ పలికిందట. అదే యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న దేవర సినిమాకు 50 కోట్ల ధర పలికిందట. అయితే ఈ సినిమాల రైట్స్‌ను తీసుకుంది ఎవరో కాదు.. అనిల్ తడాని.!

04.prabhas: వింటేజ్‌ లుక్‌లో ప్రభాస్‌.. రాజాసాబ్ వీడియో లీక్.!

ఎవరు అవునన్నా కాదన్నా.. ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్‌ లుక్స్‌ కాస్త మారిపోయాయనే కంప్లైట్ ఉంది జనాల్లో…! అయితే ఆ కంప్లైట్ ఇప్పుడు పక్కకు పోయేలా మళ్లీ తన మునుపటి లుక్‌లోకి ట్రాన్స్‌ ఫాం అయ్యారు రెబల్ స్టార్ ప్రభాస్‌. రాజాసాబ్‌ సినిమాలో తన వింటేజ్‌ లుక్‌లోనే కనిపించనున్నారు. అందుకు చిన్న సాంపిల్‌లా.. ఈ మూవీ సెట్ నుంచి లీక్‌ అయిన వీడియోలో కనిపించి.. తన లుక్స్‌తో అందర్నీ అరిపించేస్తున్నారు.

05.sandeep: నటుడిపై సందీప్ రెడ్డి వంగా సీరియస్

తన సినిమాలపై ఎవరైన చిన్న కామెంట్ చేసినా.. చాలా పెద్దగా రియాక్టయ్యే సందీప్ రెడ్డి వంగా.. ఈసారి ఇంకాస్త పెద్దగా.. సీరియస్గా రియాక్టయ్యాడు. అర్జున్ రెడ్డి హిందీ రిమేక్ కబీర్ సింగ్ సినిమాలో.. లెక్చరర్ గా నటించిన అదిల్ హుస్సేన్‌.. కబీర్ సింగ్ సినిమాలో నటించినందుకు.. ఎందుకు నటించానా అని ఫీలవుతున్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక మాటలకు రియాక్టైన వంగా.. అదిల్ పై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డాడు. ‘మీరు నటించిన 30 సినిమాలతో రాని గుర్తింపు .. ఈ బ్లాక్ బస్టర్ సినిమాతో వచ్చింది. దురాశ ఎక్కువగా ఉన్న మిమ్మల్ని నా సినిమాలో తీసుకున్నందుకు బాధ పడుతున్నా’ అంటూ ట్వీట్ చేశారు. ఇకపై మీరు సిగ్గుపడకుండా ఆ మూవీలోని మీ ఫేస్ను AIతో మార్చేస్తా అంటూ మరో ట్వీట్ చేశాడు సందీప్ రెడ్డి వంగా..!

06.mansoor alikhan: ఆసుపత్రిలో నటుడు.. విషం ఇచ్చారని ఆరోపణ.!

త్రిష పై అనుచిత వ్యాఖ్యలు చేసి.. రీసెంట్‌గా సోషల్ మీడియాలో తెగ తిరిగిన మన్సూర్ అలీఖాన్.. మరో సారి అదే పని చేస్తున్నారు. రెండు రోజుల క్రితం తమిళనాడు లోక్‌ సభ ఎన్నికల వేళ.. ప్రచారంతో బిజీగా ఉన్న ఈయన ఉన్నట్టుండి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరి.. అంతటా హాట్ టాపిక్ అయ్యారు. ఇక ఇప్పుడు తాను అస్వస్థతకు కారణం తనపై విష ప్రయోగం చేయడమే అంటూ కామెంట్స్ చేశాడు. జూస్‌లో తనకు ఎవరో విషయం ఇచ్చారని అది తాగాకే.. గుండెనొప్పితో తాను ఆసుపత్రి పాలుకావాల్సి వచ్చిందన్నాడు.

07.shekar kammula: లీడర్‌కు సీక్వెల్ వస్తుందోచ్..

శేఖర్ కమ్ముల సినిమాలన్నింటిలో లీడర్‌ సినిమాకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. రానా డెబ్యూ ఫిల్మ్ గా 2010లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్టైంది. రానాను హీరోగా నిలబెట్టింది. అయితే ఈ సినిమాకు త్వరలో సీక్వెల్ రాబోతోంది. ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే ఆలోచన తనకు ఉన్నట్టు తాజాగా చెప్పారు శేఖర్ కమ్ముల.

08.MAD: మొదలైన మ్యాడ్2.

మ్యాడ్ సినిమా ఏ రేంజ్లో హిట్టైందో తెలుసు.. అయితే ఇప్పుడీ మ్యాడ్ సినిమాకే సీక్వెల్ వచ్చేస్తోంది. డీజె టిల్లకు ఎలా అయితే టిల్లు స్క్వేర్ సినిమాను సీక్వెల్‌గా సితార ఎంటర్ టైన్మెంట్స్‌ ప్రొడక్షన్స్‌ తీసుకొచ్చిందో.. సేమ్ అలాగే మ్యాడ్‌కు .. మ్యాడ్‌ స్క్వేర్ సినిమాను తీసుకొస్తోంది ఈ ప్రొడక్షన్ కంపెనీ. ఫస్ట్ సినిమాకు రైటర్ అండ్ డైరెక్టర్ గా పనిచేసిన కళ్యాణ్ శంకరే ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ముహూర్త కార్యక్రమం హైద్రాబాద్‌లో.. ఘనంగా జరిగింది.

09.divyanka: హీరోయిన్‌కు యాక్సిడెంట్‌.

సీరియల్ హీరోయిన్ దివ్యాంకా త్రిపాఠీకి యాక్సిడెంట్ జరిగింది. దీంతో ఆమె చేతి ఎముకలు పెరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె కోకిలా బెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఆమె భర్త తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేశారు. దీంతో ఆమె ఫ్యాన్స్ గెట్ వెల్ సూన్ అంటూ నెట్టింట కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే దివ్యాంకా త్రిపాఠీకి ప్రమాదం ఎలా జరిగిందన్నది మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!