దూకుడు మీదున్న డార్లింగ్‌.. తగ్గేదేలే అంటున్న బన్నీ!

Updated on: Mar 13, 2026 | 9:15 AM

పాన్ ఇండియా స్టార్స్ అల్లు అర్జున్, ప్రభాస్ మాలీవుడ్ పై దృష్టి సారించారు. అల్లు అర్జున్ క్రాస్ ఓవర్ కాంబోస్‌కు ప్రాధాన్యత ఇస్తుండగా, ప్రభాస్ కూడా మలయాళ దర్శకులతో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీరిద్దరి మధ్య మల్లు ఇండస్ట్రీ ప్రాజెక్టుల విషయంలో పోటీ పెరుగుతోంది.

తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు పాన్ ఇండియా స్థాయిలో ఇతర భాషల దర్శకులతో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పుష్ప చిత్ర విజయానంతరం క్రాస్ ఓవర్ కాంబినేషన్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అట్లీ, లోకేష్ కనగరాజ్ వంటి కోలీవుడ్ దర్శకులతో ఆయన రాబోయే చిత్రాలు ఈ కోవలోకి వస్తాయి. ఇదే సమయంలో, డార్లింగ్ ప్రభాస్ కూడా పొరుగు భాషల దర్శకులతో పనిచేయడంలో ముందున్నారు. ఓం రౌత్, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులను ప్రోత్సహించిన ప్రభాస్, ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇటీవల మలయాళ దర్శకుడు దినజిత్ అయ్యతన్ ప్రభాస్‌ను కలవడంతో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతుందనే చర్చ మొదలైంది.

మరిన్ని వీడియోల కోసం :

స్పిరిట్‌ కథలో అవే హైలైట్స్ !

గ్లోబల్‌ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్‌

ఉస్తాద్‌ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ

Loading...
Unable to load recommendations.
Follow Us