ఏంటీ ‘బొమ్మరిల్లు’ హీరో ఎన్టీఆరా ?? ఊహకందని ట్విస్ట్ ఇది!

Updated on: Jun 02, 2025 | 7:43 PM

NTR అంటే ఊర మాసు హై ఎనర్జటిక్ యాక్షన్ సీన్లు ఉండాల్సిందే కదా..! దానికి యాడ్‌ ఆన్ గా... దిమ్మతిరిగిపోయేలా డ్యాన్స్ మూమెంట్స్‌ కూడా ఉండాల్సిందే కదా..! వీటికి తోడు పవర్ ఫుల్ డైలాగులు.. ఫాట్ మని కొట్టినట్టు ఉండే పంచ్‌లు.. రోమాలు నిక్కపొడిచేలా ఎలివేషన్లు! ఎవరైనా తారక్‌తో సినిమా అంటే ఇదే ఊహిస్తారు. డైరెక్టర్లు కూడా ఇదే తీస్తారు.!

కానీ ఇక్కడో ట్విస్ట్‌ ఉంది. ఇవేమీ లేకుండానే.. ఓ సాదాసీదా కథలో ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని ఓ డైరెక్టర్‌ అనుకున్నాడని తెలుసా. ఆయన ఎవరో కాదు డైరెక్టర్‌ భాస్కర్. ఆయన తీయాలనుకున్న సినిమా ఏంటో కాదు.. బొమ్మరిల్లు మూవీ. మీకు షాకింగ్‌గా ఉన్నా ఇది నిజం! తెలుగు సినిమాల్లో కల్ట్ క్లాసిక్ హిట్ గా నిలిచిన సినిమా బొమ్మరిల్లు. భాస్కర్ డైరెక్షన్లో.. సిద్దార్థ్, జెనీలియా లీడ్‌ రోల్లో నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. లవ్ అండ్ ఎమోషన్స్ తో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలాంటి ఈ సినిమా ముందు ఎన్టీఆర్‌ దగ్గరకే వచ్చింది. ఎస్ ! గతంలో ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని చెప్పిన తారక్‌… బొమ్మరిల్లు సినిమాను మొదట దిల్ రాజు తన దగ్గరకే తీసుకొచ్చాడంటూ ఓపెన్ అయ్యాడు. కథ విపరీతంగా నచ్చినప్పటికీ… తన ఇమేజ్ వల్ల ఈ మూవీ హిట్ అవ్వదని ఫీలైన తారక్.. బాధతో అయిష్టంగానే పక్కన పెట్టేశానంటూ చెప్పాడు తారక్. అయితే సెప్టెంబర్‌ 21న బొమ్మరిల్లు సినిమా రీ రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే మరోసారి తారక్ ఇంటర్వ్యూ కాస్తా బయటికి వచ్చింది. అది కాస్తా నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్షమించమంటూ.. నానికి ట్వీట్‌ చేసిన సూర్య

గద్దర్ అవార్డు విజేతలకు భారీగా ప్రైజ్ మనీ.. ఒక్కొక్కరికి ఎంత రానుందంటే ??

దీపికను టార్గెట్ చేసిన ప్రభాస్‌ ఫ్యాన్స్‌! ఆగం ఆగం చేస్తున్నారుగా

ఓటీటీలు గట్రా లేవ్‌.. నా సినిమాను నేరుగా యాట్యూబ్‌లో వేస్తా

నల్లని ఒత్తయిన జుట్టు కోసం.. ఇదొక్కటి చాలు