హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో

Updated on: Dec 07, 2025 | 2:02 PM

సినిమా హీరో, హీరోయిన్స్ బిజినెస్ లలో కూడా పెట్టుబడులు పెడతారని తెలిసిందే. ఇటీవల చాలా మంది ఫుడ్ బిజినెస్ లు మొదలుపెడుతున్నారు. ఈ క్రమంలోనే సింధూరం, డ్రింకర్ సాయి సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ధర్మ మహేష్ జిస్మత్ మండీ రెస్టారెంట్స్ ని మొదలుపెట్టాడు. కొన్నాళ్ల క్రితం ధర్మ మహేష్ తన భార్యతో ఉన్న వివాదంతో వైరల్ అయిన ఈయన ఇప్పుడు మాత్రం ఈ బిజినెస్ మీద ఫోకస్ చేసినట్టు కనిపిస్తున్నాడు.

మొదట ధర్మ మహేష్ Gismat పేరుతో రెస్టారెంట్స్ ని మొదలు పెట్టాడు. ఇప్పుడా రెస్టారెంట్ పేరును తన కొడుకు జగద్వజ పేరు మీదకు మారుస్తూ రీ బ్రాండిగ్ చేశాడు. Jismat గా తన రెస్టారెంట్స్ అప్‌గ్రేడ్ చేశాడు. ఇటీవల అమీర్‌పేట్‌లో ఓ రెస్టారెంట్ ని ప్రారంభించగా తాజగా చైతన్యపురిలో ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేసాడు. ఈ సందర్భంగా తన రెస్టారెంట్ కి వచ్చేవాళ్లకు స్పెషల్ ఆఫర్ కూడా ఇచ్చాడు ఈ హీరో.తన కొడుకు జగద్వజ లాగే ఎవరి పేరు అయినా J తో స్టార్ట్ అయితే వాళ్లకు మినీ చికెన్ మండీ ఫ్రీగా ఇస్తానంటూ ధర్మ మహేష్ చెప్పాడు. అంతేకాదు ఈ ఆఫర్ కేవలం కొద్దీ రోజులు మాత్రమేనట. అందుకు మీ పేరు ఉన్న ప్రూఫ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది.

మరిన్ని వీడియోల కోసం :

ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియో

టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి వీడియో

చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో

పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. తొడగొట్టి సవాలు విసురుతున్న 95 ఏళ్ల యువకుడు వీడియో