చావు బతుకుల్లో ఉన్నోడిని తన గొప్ప మనసుతో కాపాడిన తమన్

Updated on: Nov 17, 2024 | 4:54 PM

ప్రస్తుతం సౌత్‌ ఫిల్మ్ ఇండస్ట్రీలో జెట్‌ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. సినిమాలు.. షోలు.. ఫిల్మ్ ఈవెంట్స్‌లో అదరగొడుతున్న ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడో గొప్ప పని చేశాడు. తన సాయంతో ఇప్పుడు నెట్టింట ప్రశంసలు అందుకున్నాటున్నాడు. తనకి వీలైనంత వరకు సాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే తమన్.. ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో సాయం కావాలని అడిగితే సోషల్ మీడియాలో స్పందిస్తుంటాడు.

వాళ్ల వివరాలు తీసుకుని సాయం చేస్తుంటాడు. అలా తాజాగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ అవసరం అయిన పేషంట్ కి తమన్ సాయం చేశాడు. ఈ విషయాన్ని డాక్టర్ లీలా కృష్ణ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. థ్యాంక్యూ డియర్ తమన్. ఏఐఎన్‌యూ ఆసుపత్రిలోని రోగికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్‌ను విజయవంతంగా జరిగేలా చూశావు. నీ కైండ్ హార్ట్‌ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను అంటూ డాక్లర్ లీలా.. తన ఇన్ స్టా స్టోరీస్ లో రాసుకొచ్చాడు. దీంతో ఈ విషయం కాస్తా బయటికి వచ్చింది. తమన్ చేసిన గొప్ప పని అందరికీ తెలిసిపోయింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్నేహతో.. అల్లు అర్జున్ ప్రేమ !! తెలియగానే నిర్మలమ్మ 1st రియాక్షన్ ఇదే !!

TOP 9 ET News: చిరుతో మొదలెట్టి ప్రభాస్‌ వరకు.. ఫ్యాన్స్‌కు బన్నీ పిచ్చ క్లారిటీ..

బన్నీ టీం మాస్టర్ ప్లాన్ !! అందుకే పుష్ప2 ట్రైలర్ రిలీజ్‌ బిహార్‌లో..

Loading...
Unable to load recommendations.
Follow Us