మాకు పక్కా హిట్ కావాల్సిందే.. తాడో పేడో తేల్చుకుంటున్న హీరోలు..

Edited By: Phani CH

Updated on: Nov 18, 2025 | 1:23 PM

టాలీవుడ్‌లో కొందరు హీరోలకు 'విజయమో వీరమరణమో' అనే పరిస్థితి నెలకొంది. శర్వానంద్, రవితేజ, గోపీచంద్, అఖిల్ అక్కినేని, కళ్యాణ్ రామ్, అల్లరి నరేష్ వంటి తారలు వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. వారి భవిష్యత్తును నిర్ణయించే కీలక చిత్రాలపైనే ఆశలు పెట్టుకున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాలు వారికి హిట్ అందించి, కెరీర్‌కు మలుపు తిప్పుతాయో లేదో వేచి చూడాలి.

విజయమో వీరమరణమో అంటారు కదా..? ఇప్పుడు టాలీవుడ్‌లో కొందరు హీరోలకు ఇదే బాగా సెట్ అవుతుంది. ఆప్షన్ లేదు.. అర్జంట్‌గా హిట్ కొడితే కానీ వాళ్లు బయటపడరు. ఒక్కరు ఇద్దరు కాదు.. దాదాపు అరడజన్ మంది హీరోలకు ఇలాంటి పరిస్థితే ఉంది. ఇంకొక్క ఛాన్స్ అంటూ.. కొత్త సినిమాలతో రెడీ అవుతున్న ఆ హీరోలెవరో తెలుసా..? తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయం వచ్చేసింది టాలీవుడ్‌లో కొందరు హీరోలకు. వాళ్లు హిట్ కొట్టి కొన్ని సంవత్సరాలు అవుతుంది.. వచ్చే సినిమాలు వస్తున్నా విజయం మాత్రం రావట్లేదు. అందులో శర్వానంద్ ఓ అడుగు ముందే ఉన్నారు. ఒకప్పుడు వరస హిట్లు కొట్టిన ఈయనకు కొన్నేళ్లుగా ఫ్లాపులే వస్తున్నాయి. డిసెంబర్ 6న రాబోయే బైకర్‌పైనే శర్వా ఆశలున్నాయిప్పుడు. మాస్ మహరాజా రవితేజ పరిస్థితి కూడా ఇంచుమించూ ఇంతే. ధమాకా తర్వాత ఈయనకు మరో హిట్ లేదు. వరసగా సినిమాలు చేస్తున్నాడు కానీ ఒక్కటి కూడా కనీసం 10 కోట్ల షేర్ అందుకోలేకపోతుంది. దీన్నిబట్టి రవితేజ మార్కెట్ ఎంత దారుణంగా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ పండక్కి వస్తున్నారు మాస్ రాజా. మ్యాచో హీరో గోపీచంద్ సైతం చాలా ఏళ్లుగా హిట్ లేకుండానే ఉన్నారు. ప్రస్తుతం ఈయన సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. 7వ శతాబ్ధపు కథతో వస్తుంది ఈ చిత్రం. అలాగే లెనిన్ సినిమాతో అఖిల్ అక్కినేని కూడా తాడో పేడో తేల్చుకోడానికి రెడీ అవుతున్నారు. వీళ్లతో పాటు కళ్యాణ్ రామ్, అల్లరి నరేష్ సైతం విజయం కోసం దండయాత్ర చేస్తూనే ఉన్నారు. మరి వీళ్లను గెలుపు పలకరించేదెప్పుడో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టాలీవుడ్ లో తప్పని హీరోయిన్ల కొరత.. కారణం అదేనా ??

Varanasi: రెండు భాగాలుగా రానున్న వారణాసి.. నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్

Akhanda 2: ప్యాన్ ఇండియన్ మార్కెట్ పై బాలయ్య ఫోకస్

Published on: Nov 18, 2025 01:20 PM