కొరియా నుంచి ఆఫ్రికా వరకు.. ఖండాలు దాటేస్తున్న టాలీవుడ్ కథలు!

Edited By:

Updated on: Jul 17, 2026 | 4:19 PM

టాలీవుడ్ కథలు ఇప్పుడు దేశాల సరిహద్దులు దాటి అంతర్జాతీయ నేపథ్యాల్లో తెరకెక్కుతున్నాయి. ‘కొరియన్ కనకరాజు’ కొరియా, పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ జపాన్, ఎన్టీఆర్ ‘డ్రాగన్’ ఆఫ్రికా, రాజమౌళి తదుపరి చిత్రం ఆఫ్రికా అడవులు, అంటార్కిటికా వంటి ప్రాంతాల నేపథ్యంలో సాగనున్నట్లు సమాచారం. కొత్త లొకేషన్లు, గ్లోబల్ కథలతో తెలుగు సినిమాలు కొత్త దిశగా అడుగులు వేస్తున్నాయి.

ముంబై బ్యాక్‌డ్రాప్, కేరళ బ్యాక్‌డ్రాప్.. అంటూ మన దేశంలోని వేర్వేరు రాష్ట్రాల నేపథ్యంలో సినిమాలు చేసారు మన హీరోలు. ఇప్పుడు మనోళ్ల ఫోకస్ పారిన్ కంట్రీస్‌పై పడింది. అందుకే ఇక్కడే ఉంటూ.. అక్కడి నేపథ్యంలోనే సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్య డిఫెరెంట్ కంట్రీ బ్యాక్‌డ్రాప్‌లో కథలు రాస్తున్నారు మన దర్శకులు. మరి అలాంటి సినిమాలేంటో.. వాటి నేపథ్యాలేంటో చూద్దామా..? చూస్తున్నారుగా కొరియన్ కనకరాజు కిమ్చీకారం టీజర్‌ను.. కిమ్చీ అంటే కొరియాలో బాగా కారంగా ఉండే ఊరగాయ అని అర్థం. అదే నేపథ్యంలో వస్తుంది కాబట్టి కొరియన్ కనకరాజు టీజర్‌కు కిమ్చీ కారం అని పెట్టారు. మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కొరియో నేపథ్యంలోనే వస్తుంది. ఫ్లాపుల్లో ఉన్న వరుణ్ అండ్ గాంధీకి ఈ సినిమా హిట్టు కీలకం. ఆగస్ట్ 7న రానుంది కొరియన్ కనకరాజు. కొరియన్ కనకరాజు ప్రమోషన్స్ ఎక్కువగా కొరియన్ భాషలోనే చేస్తున్నారు మేకర్స్. ఇక అబ్బాయి కొరియా వెళ్తే.. బాబాయ్ జపాన్ వెళ్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో పవన్ హీరోగా నటించబోయే ఓజి 2 నేపథ్యం జపాన్‌లోనే ఉండబోతుంది. OGలోనే జపాన్‌ను పరిచయం చేసిన సుజీత్.. ప్రీక్వెల్‌లో ఎక్కువగా అక్కడే షూట్ చేయబోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా ఆఫ్రికా నేపథ్యంలోనే రానుంది. 1967 నాటి ఇంటర్నేషనల్ డ్రగ్ ఓపియం బిజినెస్, దాని అక్రమ రవాణా నేపథ్యంలో సాగే పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్‌లో తారక్ స్పైగా నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రాజమౌళి వారణాసిలో ఆఫ్రికా అడవుల్లోని వైల్డ్ లైఫ్, అంటార్కిటికా మంచు ప్రాంతాలు చూడొచ్చు. మొత్తానికి మన సినిమాల నేపథ్యం ఖండాలు దాటిపోతుందిప్పుడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. ప్రభుత్వ పాఠశాల ఆశ్చర్యకర గాథ!

పెన్షన్‌ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. అకౌంట్లో బ్యాలెన్స్‌ చూసి షాక్‌!

రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!

కదులుతున్న రైలులో పూజ‌లు.. రైల్వే అధికారుల రియాక్షన్‌ ఇదే!

పోలీసువైనంత మాత్రాన చట్టం నీ చుట్టం కాదు బాస్‌!

Follow Us