ఫేక్ కలెక్షన్స్.. ఎవరి కోసం.. ఎందుకోసం..?

Updated on: Jan 26, 2026 | 6:48 PM

తెలుగు సినిమా పరిశ్రమలో ఫేక్ కలెక్షన్లు, యూట్యూబ్ వ్యూస్ వివాదం తీవ్రంగా చర్చనీయాంశమవుతోంది. నిర్మాతలు హీరోలను సంతృప్తి పరచడానికో, ఇతర ఒత్తిళ్ల కారణంగానో వాస్తవానికి మించి కలెక్షన్లను ప్రకటిస్తున్నారు. దీనివల్ల ఐటీ సమస్యలు, ప్రేక్షకుల నమ్మకం కోల్పోవడం వంటి నష్టాలు ఉన్నాయి. నిర్మాణ వ్యయాన్ని నియంత్రించకపోవడం, అనవసరపు ఖర్చులు కూడా ఈ ఫేక్ ట్రెండ్‌కు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఫేక్ కలెక్షన్స్.. వచ్చింది గోరంత అయితే పోస్టర్ల మీద వేసేది కొండంత అనే టాక్ ఈ మధ్య ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది. మరి అది నిజమే అయితే.. నిర్మాతలు ఎందుకలా చేస్తున్నారు..? రాని డబ్బులను వచ్చాయని ఎందుకు చెప్పుకుంటున్నారు..? ఎవర్ని సాటిస్ ఫై చేయడానికి ఫేక్ వైపు అడుగులేస్తున్నారు..? అసలు ఈ ఫేక్ అంతా నిజంగానే జరుగుతుందా..? ఇండస్ట్రీలో ఈ మధ్య కలెక్షన్స్ టాపిక్ బాగా నడుస్తుంది.. ముఖ్యంగా వచ్చిన దానికంటే పోస్టర్స్‌పై ఎక్కువ వేసుకుంటున్నారనే చర్చ ఎక్కువగా నడుస్తుంది. సినిమా ఏదైనా.. స్టార్ ఉన్నాడంటే చాలు 50 కోట్లు వస్తే.. 100 కోట్లు చెప్తున్నారనే చర్చ నడుస్తుంది. పైగా నాగవంశీ, దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాతలు సైతం ఈ ఫేక్ కలెక్షన్లపై గతంలోనే ఓపెన్ అయ్యారు. మీడియాకు చెప్పేది కేవలం స్పెక్యులేషన్ మాత్రమే అని.. మా వ్యాపారం మేమెందుకు బయట పెట్టుకుంటామని గతంలోనే నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. అలాగే దిల్ రాజు సైతం హీరోలను సాటిస్ ఫై చేయడానికి.. కొన్ని ఒత్తిళ్ల కారణంగా మాకు తప్పదు.. మేం ఫేక్ వేయాల్సిందే అని చెప్పారు. అలాగే కొందరు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ విషయంపై సీరియస్‌గానే రియాక్ట్ అయ్యారు. కలెక్షన్స్ విషయంలోనే కాదు.. యూ ట్యూబ్ వ్యూస్‌పై ఓపెన్‌గానే ఇవన్నీ ఫేక్, డబ్బులిచ్చి కొంటున్నామని మాట్లాడేస్తున్నారు. ఆ మధ్య దిల్ రాజు ఈ వ్యూస్ మీద ఓపెన్ అయ్యారు. మరి అన్నీ ఫేక్ అంటూనే ట్రెండ్ ఎందుకు ఫాలో అవుతున్నారు..? రాని కలెక్షన్స్ వచ్చాయని.. లేని వ్యూస్ ఉన్నాయని చెప్పి నిర్మాతలెవర్ని మోసం చేస్తున్నారు..? వందల కోట్ల పోస్టర్లు వేస్తే.. రేపు ఐటి వాళ్లకు వస్తే ఏం చెప్తారు..? ఓవైపు థియేటర్స్‌కు జనమే రావట్లేదంటూ.. వందల కోట్లు వేస్తే నమ్మేదెలా..? నిజంగా ఎంతమంది నిర్మాతలకు ప్రొడక్షన్ కంట్రోల్‌పై పట్టు ఉంది..? ఆన్ లొకేషన్‌లో వేస్టేజ్ గురించి ఎందుకు పట్టించుకోరు..? ఇవన్నీ పర్ఫెక్ట్‌గా చేస్తే ఫేక్ వేయాల్సిన అవసరమే ఉండదుగా అనేది విశ్లేషకుల అభిప్రాయం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:.

ఫ్యామిలీ సినిమాలు దున్నేస్తున్నా.. స్టార్ హీరోల చూపు మాత్రం అటువైపే

Anil Ravipudi: అనిల్ రావిపూడి మాస్ ప్లానింగ్‌కు అందరూ ఫిదా

Samantha: ట్రెండింగ్ అవుతున్న సమంత.. అసలు కారణం ఇదే

Ustaad Bhagat Singh: ఉస్తాద్ డేట్ లాక్.. మెగా ఫ్యాన్స్‌కు షాక్

జనవరి నుంచి సమ్మర్ వరకు.. క్రేజీ సినిమాల జాతర