TOP 9 ET: మెగాస్టార్ దెబ్బకి పుష్ప రికార్డ్స్ అవుట్
మెగా వారసులు జనవరి 31న పుట్టబోతున్నారని రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఉపాసన ట్విన్ బేబీస్‌కి జన్మనివ్వబోతున్నారని ఇంకో పక్క మెగా ఫ్యాన్స్ కూడా సంబరాలు మొదలెట్టారు. ఈక్రమంలోనే కొంత మంది ఫ్యాన్స్ అయితే.. అప్పుడే ముహూర్తాల వెనక పడ్డారు. హిందూ పంచాగం ప్రకారం రేపు జనవరి 31 శనివారం ఉదయం 7 గంటల 38 నిముషాల వరకు త్రయోదశి ఉంది. ఆ తర్వాత చతుర్ధశి తిథి మొదలవుతోంది.
మన శంకర వర ప్రసాదు ఇప్పుడు రికార్డులకు మళ్లీ కేరాఫ్ గా మారిపోయారు. వింటేజ్ వైబ్‌ను తీసుకురావడమే కాదు.. తన వింటేజ్ జోరును కూడా నయా తరానికి తెలిసేలా చేస్తున్నారు. ఈక్రమంలోనే ఏకంగా పుష్ప రికార్డ్‌ను బద్దలు కొట్టారు మన వర ప్రసాదు. పాన్ ఇండియా లెవల్లో వచ్చిన పుష్ప సినిమా.. ఓవరాల్ గా రూ.350 కోట్ల వసూళ్లను రాబట్టింది.అదే మన శంకర వర ప్రసాదు కేవలం 18 రోజుల్లోనే రూ.358 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశారు. తన విశ్వరూపం తడాఖా ఏంటో బాక్సాఫీస్‌కి రుచి చూపించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Spirit: స్పిరిట్ కు అప్పుడే లాభాల పంట
Ram Charan: సినిమాల రేసులో వెనకబడుతున్న చరణ్
Jana Nayagan: ఆ కారణంగానే జన నాయగన్ ఇబ్బందుల్లో పడ్డాడా?
Om Shanti Shanti Shantihi: ఓం శాంతి శాంతి శాంతిః.. భార్యాభర్తల కామెడీ డ్రామా హిట్టా..? ఫట్టా..?
