TOP 9 ET News: పవన్‌ను ఫ్యాన్సే శత్రువుల చేతిలో పెడుతున్నారా?

Updated on: Sep 16, 2025 | 6:41 PM

ప్రభాస్‌, బన్నీ, చరణ్ - తారక్‌.. మన ఈ స్టార్ హీరోలు బాలీవుడ్‌ని తమ సినిమాలతో షేక్ చేశారు. దిమ్మతిరిగే వసూళ్లు కూడా రాబట్టారు. అయితే..ఇప్పుడు వీళ్ల తర్వాత ఈ ఘనత సాధించిన తెలుగు హీరోగా తేజా సజ్జా ఈ జాబితాలో చేరిపోయాడు. హనుమాన్ సినిమాతో బాలీవుడ్‌లో నేమ్ సంపాదించుకున్న తేజా.. ఇప్పుడు మిరాయ్‌తో హిందీ బెల్ట్‌లో కలెక్షన్స్‌ను భారీ గా వచ్చేలా చేసుకుంటున్నాడు. రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా బీ టౌన్‌ ఏరియాలో జస్ట్ మూడు రోజుల్లోనే 10 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. దీంతో తేజా సజ్జా పేరు.. మన పాన్ హీరోల తర్వాత నార్త్‌లో మార్మోగిపోతోంది.

పవన్‌ మోస్ట్ అవేటెడ్ మూవీ ఓజీ ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే ఈ క్రమంలో వేలం పాటలో ఈ మూవీ టికెట్‌ రేట్స్ విక్రయిస్తూ ఉండడం.. వాటిని ఫ్యాన్స్‌ భారీ ధరకు చేజిక్కించుకుంటూ ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. USలో ఒక NRI ఫస్ట్ షో టికెట్ ను రూ.5 లక్షలకు కొనుగోలు చేసి, ఆ మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చాడు. హైదరాబాద్ విశ్వనాథ్ థియేటర్ లో కూడా టికెట్ వేలం రూ.1 లక్షకు ముగిసింది. తాజాగా తెనాలిలో కూడా యాభై వేల నుంచి టికెట్ వేలం ప్రారంభం చేయాలని ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ వేలంలో వచ్చిన డబ్బును జనసేన పార్టీకి ఇవ్వాలనే మంచి ఉద్దేశంతోనే ఫ్యాన్స్‌ ఇదంతా చేస్తున్నా.. పవన్ పొలిటికల్ శత్రువులకు ఈ అంశం ఆయుధంగా మారే ఛాన్స్ ఉందనే వాదన వినిపిస్తోంది. పార్టీకి విరాళం ఇస్తే నేరుగా ఇవ్వొచ్చు.. అలా కాకుండా ఓజీ టికెట్‌ను వేలం పాటలో కొని.. ఆ మొత్తాన్ని ఇవ్వాలనుకోవడమే ఇప్పుడు ఇష్యూగా మారుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉన్నది వారమే అయినా.. గట్టిగానే సంపాదించిన శ్రష్టి

బంపర్ ఆఫర్ ! ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ! ఏం ప్లాన్ గురూ..!

మిరాయ్ సినిమాలోరాముడిగా నటించిందెవరో తెలిసిపోయింది..

ఏదో అనుకుంటే ఇంకేదో అయిందే! పాపం శ్రష్టి

Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌కు.. గుడ్ న్యూస్!