TOP9 ET: అనిల్ రావిపూడి ఎఫెక్ట్.. మూల పడిన విశ్వంభర.. బాలీవుడ్ పరువుతీసిన సంజయ్ దత్..

Updated on: Jul 12, 2025 | 3:50 PM

చిరు విశ్వంభర సినిమాపై అనిల్ రావిపూడి ఎఫెక్ట్ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో మీడియాలో తరచూ విశ్వంభర సినిమా గురించి బాగా చర్చ నడిచేది. కానీ, అనిల్ - చిరు కొత్త ప్రాజెక్ట్ ప్రకటన వచ్చాక.. సగం మెగా అభిమానుల ఫోకస్ మెగా 157 వైపు మళ్లింది. అందులోనూ తన స్టైల్ ఆఫ్ అప్డేట్స్‌తో.. అనిల్ రావిపూడి చిరు మూవీ షూటింగ్‌ను పరిగెత్తిస్తుండడంతో.. మిగిలిన ఆ సంగం మెగా అభిమానులు కూడా ఇప్పుడు మెగా 157 గురించే మాట్లాడుకుంటున్న పరిస్థితి.

ఓపక్క అనిల్ రావిపూడి – చిరు కాంబోపై నెట్టింట క్రేజీ టాక్ నడుస్తున్న వేళ.. విశ్వంభర సెట్ నుంచి ఓ న్యూస్ బయటికి వచ్చింది. ఈ మూవీకి సంబంధించిన 45 నిమిషాల గ్రాఫిక్స్ విజువల్ తాజాగా మెగాస్టార్ రివ్యూ కోసం విశ్వంభర మేకర్స్ తీసుకొచ్చారట. ఇక ఈ విజువల్స్ చూసిన మెగాస్టార్ ఫుల్ హ్యాపీగా ఫీలయ్యారట. దీంతో ఈ మూవీ టీం కాస్త రిలాక్స్‌డ్‌గా ఉన్నారని టాక్. ఇక మరో విషయం ఏంటంటే..విశ్వంభర మూవీని సెప్టెంబర్‌ 18న రిలీజ్‌ చేసేందుకు మేకర్స్ థింక్ చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగి, చిరు కూడా ఓకే చెబితే ఇదే డేట్‌ను తొందర్లో అనౌన్స్ కూడా చేస్తారట.

మన సినిమాలు టాలీవుడ్‌ పరిధిని దాటి పాన్ ఇండియా స్థాయిలో అదరగొడుతున్నా… నార్త్ లోనూ మన సినిమాలు ఊహించని రీతిలో సక్సెస్ అవుతున్నా.. ఎక్కడో నార్త్ వారికి, మనకు గ్యాప్ ఇంకా ఉందని కొందరు సినీ విశ్లేషకుల వాదన. ఆ వాదనను నిజం చేస్తూ.. ఇప్పుడు కొన్ని కామెంట్స్ నెట్టింట కనిపిస్తున్నాయి. హిందీలో బిగ్ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణ్‌ లో.. సీతగా సాయి పల్లవిని తీసుకోవడంపై ఇప్పటికీ చాలామంది హిందీ నెటిజన్లు నెట్టింట విమర్శలు చేస్తూనే ఉన్నారు. బాలీవుడ్‌లో ఎందరో అందమైన హీరోయిన్లు ఉండగా.. సీత పాత్రకి సాయి పల్లవిని ఎంచుకోవడం ఏంటని.. రామాయణ్ డైరెక్టర్ నితీష్‌ తివారీని ప్రశ్నిస్తున్నారు. సాయి పల్లవి అందంపై కాస్త దిగజారి కామెంట్స్ చేస్తూ.. ఆమెపై విషం చిమ్ముతూ పోస్టులు కూడా పెడుతున్నారు.