TOP 9 ET News: డాకు మహారాజ్ బంపర్ హిట్.. డే1 దిమ్మతిరిగే కలెక్షన్స్
బాలయ్య బంపర్ హిట్ కొట్టేశాడు. మరో సారి సంక్రాంతి బుల్లోడిగా.. ట్యాగ్ వచ్చేలా చేసుకున్నాడు. ఇక బాబీ డైరెక్షన్లో బాలయ్య చేసిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య తాజాగా రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వడమే కాదు.. త్రూ అవుట్ వరల్డ్ అందరి అంచనాలను అందుకుంది. డే1 రికార్డ్ లెవల్లో దిమ్మతిరిగే ఓపెనింగ్స్ ను తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర కోట్లలో కలెక్షన్స్ రాబట్టింది.
బాలయ్య గర్జనను మ్యాచ్ చేసే లెవల్లో బ్యాక్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం అంత ఈజీ కాదు. కానీ రీసెంట్ డేస్లో ఈ పనిని పర్ఫెక్ట్ గా చేస్తున్న తమన్.. మరో సారి అదే చేశారు. డాకు మహారాజ్ గా బాలయ్య చేసిన రోరింగ్ ఫర్ఫార్మెన్స్‌ను తన స్టైల్లో ఎలివేట్ చేశాడు. ఆర్ ఆర్ ఇరగదీశాడనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాడు తమన్. అంతేకాదు మరో పక్క బాలయ్య స్క్రీన్ ప్రజెన్స్‌కు.. తమన్ మ్యూజిక్‌తో చెలరేగిపోవడం కూడా ఈ సినిమాకు కలిసొచ్చిందనే కామెంట్ వస్తోంది నెట్టింట. ఇక ఇంకొన్ని చోట్లైతే.. ఏకంగా థియేటర్లోని సౌండ్ బాక్సులు బద్దలవుతున్నాయనే టాక్ బయటికి వచ్చి నెట్టింట వైరల్ అవుతోంది. అలా ఉంటది మరి ఈ కాంబో..!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: