TOP 9 ET News: ‘శభాష్ రామ్ చరణ్! మంచి నిర్ణయం తీసుకున్నావ్..’
జక్కన్నతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ బిగ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్టుగా టాలీవుడ్‌లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం బన్నీ అట్లీ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్లో ప్రశాంత్ నీల్ డైరక్షన్లో రవణం సినిమా చేస్తాడని టాక్. ఇక ఈ రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తర్వాత.. నేరుగా బన్నీ.. జక్కన్న అండర్‌లోకి వెళ్లనున్నాడని.. ఆయన డైరెక్షన్లో గ్లోబల్ రేంజ్‌లో ఓ సినిమా చేయనున్నాడని ఇన్‌సైడ్ టాక్. అటు జక్కన్న SSMB29 సినిమాను జెట్ స్పీడ్‌లో ఫినిష్ చేస్తున్నాడు.
టాలీవుడ్‌లో హీరోలకుండే ట్యాగ్స్‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సినిమా బిగినింగ్‌లోనూ ఈ ట్యాగ్స్ టైటిల్ రేంజ్లో పడాలనే కోరిక హీరోల నుంచి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్‌కు ఎప్పుడూ వెళుతూనే ఉంటుంది. అయితే ఇలాటి ఈ పరిస్థితుల్లో తాజాగా స్టార్ హీరో రామ్ చరణ్ తన గ్లోబల్ స్టార్ ట్యాగ్‌ను వదిలేసినట్టుగా తెలుస్తోంది. బుచ్చి బాబు డైరెక్షన్లో తాను చేస్తున్న పెద్ది మూవీలో గ్లోబల్ స్టార్ ట్యాగ్ వద్దని స్వయంగా చరణ్ సూచించినట్టుగా ఓ టాక్ టాలీవుడ్‌లో వైరల్ అవుతోంది. అయితే గేమ్ ఛేంజర్ మూవీలో ఇదే ట్యాగ్‌ను చరణ్ క్యారీ చేసినప్పటికీ.. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో.. ఆ ట్యాగ్ ను వదిలేసినట్టు టాక్. అయితే ఈ న్యూస్ పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నెటిజన్లు అందరూ రామ్ చరణ్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌కు మన హీరోలు ఎదిగిన ఈ క్రమంలో.. మన హీరోల ట్యాగ్‌లు ఇతర భాషల్లో అడ్డుగా మారే ప్రమాదం ఉందనే కామెంట్ ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బుద్ది లేనోడు.. గడ్డి తిన్నోడే.. అలా చేస్తాడు..
ఇలా అయితే అద్దె ఇంట్లో బతికేదెలా
చికెన్ ఫ్రై కోసం పెళ్లిలో పొట్టు పొట్టు కొట్టుకున్నారు
