హీరోయిన్ రాశీ ఖన్నాకు ప్రమాదం.. ముక్కు, చేతులకు తీవ్ర గాయాలు..

Updated on: May 21, 2025 | 4:02 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా తీవ్రంగా గాయపడింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమెనే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో తన ముక్కు నుంచి రక్తం కారుతుంది. అలాగే కాళ్లకు, చేతులకు కూడా దెబ్బలు తగిలి రక్తం కారుతున్నాయి.తన అప్‌కమింగ్ సినిమా షూటింగ్‌లో రిస్కీ యాక్షన్‌ సీన్స్‌లో రాశీ ఖన్నా పాల్గొంది. అందువల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఇక అసలు విషయం ఏంటంటే..! ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో ఫర్జీ-2 వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తోంది. ఈ షూటింగ్ లోనే రాశీకి గాయాలైనట్లు న్యూస్. ఇక ఇదే విషయంపై రాశీ ఖన్నా కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘ఒక్కోసారి కొన్ని రోల్స్ అడగవు, అవి డిమాండ్ చేస్తాయి. మీ గాయాలు కూడా ఒక్కోసారి మీ శరీరం, మీ శ్వాస మీద ప్రభావం చూపవచ్చు. కానీ మీరు తుఫానుగా మారినప్పుడు ఈ ఉరుములు, మెరుపులకు కదలరు. త్వరలనే మళ్లీ వస్తాను’ అంటూ తన పోస్టులో రాసుకొచ్చింది రాశీ ఖన్నా. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు స్పందిస్తున్నారు. రాశీ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఒకప్పుడు హీరోయిన్ రాశిఖన్నా తెలుగులో వరుసగా సినిమాలు చేసి మంచి విజయాలు సాధించింది. ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్దగా కనిపించడం లేదీ అందాల తార. ప్రస్తుతం సిద్ధూ జొన్నలగడ్డతో కలిసి తెలుసు కదా అనే సినిమాలో మాత్రమే నటిస్తుంది. ఇందులో శ్రీనిధి శెట్టి కూడా హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో జోరు తగ్గినా బాలీవుడ్ లో వరుసగా సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటిస్తోందీ అందాల తార. ఆ మధ్యన సబర్మతీ ఎక్స్ ప్రెస్ సినిమాలో హీరోయిన్ గా నటించింది రాశీ ఖన్నా. ఇందులో ఆమె అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఓ హిందీ సినిమా, వెబ్ సిరీస్ ఉన్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హీరోగా నా ఎదుగుదలను చూడకుండానే.. వెళ్లిపోయావా అమ్మా..

తాటి బెల్లం ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు

ప్రతి చిన్న విషయానికి కోపంతో రగిలిపోతున్నారా..? ఇది మీ కోసమే

మొబైల్ ఛార్జ్ చేసి ఛార్జర్ ను అలాగే వదిలేస్తున్నారా