కోటిన్నర కారు కొన్న స్టార్ కమెడియన్

Updated on: May 28, 2025 | 2:47 PM

వైవా అనే షార్ట్ ఫిల్మ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హర్ష. ఒక యూట్యూబర్ గా కెరీర్ ఆరంభించిన అతను తన సొంత ట్యాలెంట్ తో హీరోగా మారాడు. మొదట పలు సినిమాల్లో హీరో ఫ్రెండ్ గా సపోర్టింగ్ రోల్స్ లో మెరిశాడు. చాలా సినిమాల్లో కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించి మెప్పించాడు. ఇక గతేడాది సుందరం మాస్టర్ సినిమాతో హీరోగా కూడా అదృష్టం పరీక్షించుకున్నాడు.

మాస్ మహరాజా రవితేజ నిర్మించిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచినా నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు హర్ష. ఇటీవలే ప్రియదర్శి హీరోగా నటించిన సారంగపాణి జాతకం సినిమాతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. సినిమాల సంగతి పక్కన పెడితే.. హర్షకు కార్లు, బైక్స్ అంటే పిచ్చి. ఇప్పటికే అతని గ్యారేజ్ లో లగ్జరీ స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయి. వీలుచిక్కినప్పుడల్లా స్పోర్ట్స్ బైక్స్ వేసుకుని ఫ్రెండ్స్‌తో కలిసి లాంగ్ డ్రైవ్స్‌కి వెళ్తుంటాడీ యాక్టర్. తాజాగా హర్ష గ్యారేజ్ లోకి మరో ఖరీదైన లగ్జరీ కారు వచ్చి చేరింది. ఎస్ ! ఈ స్టార్ కమీడియన్ BMW F87 M2 కాంపిటీషన్ కారును కొనుగోలు చేశాడు. అంతేకాదు ఈ గుడ్ న్యూస్‌ను తన ఫ్యాన్స్‌ అండ్ ఫాలోవర్స్‌తో తానే స్వయంగా పంచుకున్నాడు. కొత్త కారుతో దిగిన ఫొటోలను తన ఇన్ స్టాలో షేర్ చేశాడు. ఇక ఈ కార్ ధర.. హైద్రాబాద్‌ మార్కెట్లో కోటి 30 లక్షల రూపాయల నుంచి కోటి 40 లక్షల రూపాయల వరకు ఉందని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.235 కోట్లు వసూలు చేసిన తుడురుమ్‌ మూవీ ఇప్పుడు OTTలో…

చెడ్డీపై హీరో సాహసయాత్ర.. పోలీసుల వరకు మ్యాటర్

రూ.300 నుంచి రూ.50 కోట్ల వరకు! ప్రకాశ్ రాజ్ దిమ్మతిరిగే సంపాదన

సినిమాలోని దెయ్యం థియేటర్‌లోకి వచ్చిందా ?? వణుకుపుట్టించిన ఘటన

మంచు విష్ణుకు బిగ్ షాక్ ‘కన్నప్ప’ సినిమా హార్డ్‌డిస్క్‌ చోరీ..