సంక్రాంతి బ్లాక్‌బస్టర్.. మరి సమ్మర్ సినిమాల పరిస్థితేంటి

Edited By:

Updated on: Jan 21, 2026 | 5:27 PM

సంక్రాంతి 2026 సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. చిరంజీవి, ప్రభాస్, నవీన్ పొలిశెట్టి చిత్రాలు వసూళ్ల వర్షం కురిపించాయి. ఈ జోరును 2026 సమ్మర్ సినిమాలు కొనసాగిస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది. రాబోయే సమ్మర్‌లో టాక్సిక్, దురంధర్ 2, ప్యారడైజ్, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి అనేక భారీ యాక్షన్ చిత్రాలు విడుదల కానున్నాయి. సంక్రాంతి ఇచ్చిన స్ఫూర్తితో సమ్మర్ కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.

చూస్తుండగానే సంక్రాంతి సీజన్ అయిపోయింది.. హలీడేస్ నుంచి అంతా తిరిగొచ్చేసారు కూడా.. అలాగే పండగ సినిమాలు కూడా సెలవుల్లో దుమ్ము దులిపేసాయి. మరి ఇదే జోరు సమ్మర్ సినిమాలు కంటిన్యూ చేస్తాయా..? పొంగల్ ఇచ్చిన ఇన్‌స్పిరేషన్‌తో సమ్మర్ టాప్ లేచిపోతుందా..? అసలు 2026 సమ్మర్ ఎలా ఉండబోతుంది..? ఆలోపు రాబోయే సినిమాలేంటి..? చూద్దామా ఎక్స్‌క్లూజివ్‌గా.. సంక్రాంతి సినిమాల దెబ్బకు బాక్సాఫీస్ టాప్ లేచిపోయింది.. బాస్ సింహభాగం తీసుకుంటే.. ప్రభాస్, నవీన్ పొలిశెట్టి, శర్వానంద్, రవితేజ మెగాస్టార్‌ను ఫాలో అయిపోయారు. ఎవరికి వాళ్లు వసూళ్ల వర్షం కురిపించారు. పండగ సినిమాల్లో రాజా సాబ్ కాస్త వెనకబడినా.. తన స్టార్ పవర్‌తో 200 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసారు ప్రభాస్. ఇకపై దీనికి అసలు పరీక్ష ఎదురు కానుంది. ఈసారి సంక్రాంతికి రప్ఫాడిద్దాం అంటూ ఓపెనింగ్ రోజు చెప్పిన మాటను నిలబెట్టుకున్నారు చిరంజీవి, అనిల్ రావిపూడి. మన శంకరవరప్రసాద్ గారు 300 కోట్ల వైపు దూసుకుపోతుంది. ఇక నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు 100 కోట్ల క్లబ్బులో చేరిపోగా.. నారీనారీ నడుమ మురారి 20 కోట్ల గ్రాస్‌తో హిట్ దిశగా అడుగేస్తుంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి పర్లేదనిపిస్తుంది. సంక్రాంతి సీజన్ అంతా నవ్విస్తే.. సమ్మర్ మాత్రం యాక్షన్ ప్రియులకు పండగలా మారబోతుంది. గత రెండు మూడేళ్లుగా బోసిపోతున్న సమ్మర్ సీజన్.. ఈసారి మాత్రం రప్ఫాడించడానికి రెడీగా ఉంది. మార్చి 19న టాక్సిక్‌తో పాటు ధురంధర్ 2, డెకాయిట్ సినిమాలు రానున్నాయి. ఈసారి సమ్మర్ సీజన్‌కు రిబ్బన్ కట్ చేస్తున్న సినిమాలు ఇవే. పైగా అన్నీ యాక్షన్ సినిమాలే. మార్చి 26న నాని ప్యారడైజ్, 27న రామ్ చరణ్ రానున్నాయి. ఇవి కూడా ప్యూర్ యాక్షన్ సినిమాలే. ఇక చిరంజీవి విశ్వంభర, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సైతం సమ్మర్‌నే టార్గెట్ చేస్తున్నాయి. వీటితో పాటు గూఢచారి 2, లెనిన్, వెంకటేష్ త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం కూడా సమ్మర్‌లోనే విడుదల కానున్నాయి. మరి సంక్రాంతి జోరును సమ్మర్ సినిమాలు కొనసాగిస్తాయో లేదో చూద్దాం..!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Anil Ravipudi: అనిల్ రావిపూడి అంటే పేరు అనుకుంటివా.. హిట్టులకు బ్రాడ్

కొత్త ఏడాది.. కొత్త హీరోయిన్లు.. ఇండస్ట్రీ అంతా కొత్తదనమే

Prabhas: ప్రభాస్ ప్లాన్‌కు మైండ్ బ్లాక్.. ఇలాగైతే రికార్డులు కష్టమే

Varun Tej: వరుణ్ తేజ్ పరిస్థితి ఏంటి.. కనకరాజు కరుణిస్తాడా..?

Keerthy Suresh: మరోసారి బాలీవుడ్‌ వైపు చూస్తున్న కీర్తి సురేష్.. అంతలా ఏముంది అక్కడ

Published on: Jan 21, 2026 05:23 PM