‘పాటల రచయితపై చెప్పు విసిరిన మహిళ..’కట్ చేస్తే షాకింగ్ నిజం

Updated on: Jan 25, 2026 | 6:53 PM

తమిళ గేయ రచయిత వైరముత్తుపై తిరుప్పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ మహిళ చెప్పు విసిరారు. జనవరి 21న జరిగిన ఈ ఘటన వీడియో ఇప్పుడు కోలీవుడ్‌లో వైరల్‌గా మారింది. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, ఆ మహిళకు మతిస్థిమితం లేదని తేలింది. గతంలోనూ ఆమె పలువురిపై ఇలాంటి దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు.

తమిళ సినీ గేయ రచయిత వైరముత్తుపై ఓ మహిళ చెప్పు విసిరిన ఘటన ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. జనవరి 21న ఈ ఘటన జరిగినప్పటికీ.. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు మరింతగా వైరల్ అవుతోంది. స్టార్ రైటర్ మరియముత్తు వైపే అందరూ చూసేలా చూస్తోంది. జనవరి 21న తిరుప్పూర్‌లో జరిగిన కొంగు కళ, సాహిత్య, సంస్కృతి మండలి ప్రారంభోత్సవానికి వైరముత్తుకి ఆహ్వానం అందింది. ఇందులో పాల్గొనేందుకు వైరముత్తు తిరుప్పూర్‌ కలెక్టరేట్‌ వెళ్లారు. ఈ క్రమంలోనే ఓ మహిళ గుంపులో నుంచి వైరముత్తుపైకి చెప్పు విసిరారు. అయితే ఆ చెప్పు ఆయనపై కాకుండా మరో వ్యక్తిపై పడింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. చెప్పు విసిరిన మహిళను అదుపులోకి తీసుకుని విచారించి.. ఆమెకు మతిస్థిమితం లేదని తేల్చారు. తిరుప్పూర్‌లోని కలెక్టర్‌ ఆఫీసుతో పాటు.. కోర్టు ప్రాంగణంలో పలు సందర్భాల్లో.. పలువురిపై ఈమె చెప్పులు విసిరినట్టు పోలీసులు గుర్తించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET: రోజు రూ.25 లక్షలు ఖర్చు చేస్తున్న చిరు!

Sharwanand: న్యూ ఏజ్ క్రైమ్‌ కామెడీకి.. రిబ్బన్ కట్ చేసిన శర్వా..

Akira Nandan: తండ్రిని ఫాలో అవుతూ.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పవన్ కొడుకు

పోలీసుల కళ్ళకు ఏఐ గ్లాసెస్‌.. క్షణాల్లో వారిని పట్టేస్తుంది

Kashmir: భూతల స్వర్గం.. కశ్మీర్ సొగసు చూడతరమా