ఈయన ఇలా ఉన్నాడేంట్రా ?? ఇంట్లో దొంగలు పడితే పిలిచి డబ్బిస్తారా ??

Updated on: Jul 31, 2025 | 5:41 PM

జగపతి బాబు..! హీరో టూ క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన ఈయన.. ఎట్ ప్రజెంట్ వరుసగా సినిమాలు చేస్తూ పోతున్నాడు. పాన్ ఇండియా రేంజ్లో సినిమాలు చేస్తూ.. త్రూ అవుట్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్‌గా సోషల్ మీడియాలో క్రేజీ క్రేజీగా రీల్స్ చేసి పోస్ట్ చేయడం మొదలుపెట్టారు జగపతి. ఇక ఆ రీల్స్‌తో నెట్టింట ఎప్పుడూ ట్రెండ్ అయ్యే జగపతి బాబు.. తను పోస్ట్ చేసే రీల్‌కు సంబంధం లేకుండా.. మరో న్యూస్‌తో వైరల్ అవుతున్నాడు.

ఏంటి ఇలాక్కూడా ఉంటారా? అనే కామెంట్ను కూడా వచ్చేలా చేసుకుంటున్నాడు జగ్గూ భాయ్‌. ఇక ఏదైనా సరే.. ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడతాడు జగపతి బాబు. ఏ విషయం అయినా సరే తన ఒపినియన్‌ను నిర్మొహమాటంగా చెప్పేస్తాడు. తన సినీ, పర్సనల్ లైఫ్‌లలోని ఎత్తుపల్లాల గురించి కూడా ఓపెన్‌గా చెప్పేస్తాడు. బయటకు ఎక్కడికి వెళ్లినా అందరి బిల్స్ తనే కట్టడం జగపతిబాబుకి ఉన్న వీక్‌నెస్. సినిమాలు తేడా కొట్టినప్పుడు ప్రొడ్యూసర్స్‌కు రెమ్యూనరేషన్ డబ్బు వెనక్కి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఎవరైనా హెల్ప్ అంటే చాలు ఆయన కరిగిపోయి.. అడిగినంత ఇచ్చేస్తాడు. అలాంటి కైండ్ హార్ట్ ఉన్న జగపతి బాబు.. ఓ టైంలో తన ఇంట్లో పడిన దొంగలకే సాయం చేశాడట. ఎస్ ! జగపతి బాబు నివాసంలో ఓ సారి దొంగలు పడ్డారు. పోలీసులు వాళ్లను పట్టుకుని కేసు పెట్టి జైలుకు పంపారు. ఆ తర్వాత దొంగల భార్యలు జగపతిబాబుకు ఫోన్ చేశారట. పిల్లలతో తాము రోడ్డున పడ్డామని బోరున విలపించారట. దీంతో ఆ దొంగల కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు జగపతి బాబు. అది కూడా ఒకసారి చేసి చేతులు దులుపుకోలేదు.. దొంగలు జైలు నుంచి విడుదల అయ్యేంతవరకు వారి కుటుంబాలకు నెల నెలా వారికి డబ్బు పంపుతూనే ఉన్నారట. ఈ విషయాన్ని తానే ఓ ఇంటర్య్వూలో చెప్పాడు జగపతిబాబు. దీంతో ఈయనేంట్రా బాబు.. మరీ ఇంత మంచోడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kingdom: విజయ్ ఖాతాలో మరో హిట్ ?? కింగ్‌డమ్ సినిమా ఎలా ఉందంటే