The Raja Saab: మరీ అన్ని గంటలేంటి రాజా సాబ్.. మైండ్ పోతుంది ఇక్కడ

Updated on: Dec 04, 2025 | 5:54 PM

ప్రభాస్ రాజా సాబ్ చిత్రం అతని కెరీర్‌లోనే అత్యధిక రన్‌టైమ్ 3 గంటల 14 నిమిషాలతో వస్తోంది. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ హారర్ కామెడీపై మేకర్స్ పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఇతర పెద్ద సినిమాల రన్‌టైమ్‌లతో పోల్చి చూస్తే, కంటెంట్ బాగుంటే నిడివి సమస్య కాదని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. యుఎస్ బుకింగ్స్ నెల రోజుల ముందే ప్రారంభమవుతున్నాయి.

ప్రభాస్ సినిమా అంటే భారీ బడ్జెట్ కామన్.. కనీసం 300 కోట్లు లేకుండా సినిమాలు చేయలేకపోతున్నారు దర్శకులు. మరి అంతంత పెడుతున్నపుడు చిన్న సినిమా చూపిస్తే ఏం బాగుంటుంది చెప్పండి..? అందుకే ప్రభాస్ 6 ఫీట్ కటౌట్‌కు తగ్గట్లే.. రన్ టైమ్ కూడా భారీగా పెంచేస్తున్నారు. తాజాగా రాజా సాబ్ ఏకంగా రెబల్ స్టార్ కెరీర్‌లోనే హైయ్యస్ట్ అంటున్నారు. మరి అదేంటో చూద్దామా..? చూస్తుండగానే సంక్రాంతి దగ్గరికి వచ్చేసింది.. మరో నెల రోజుల్లో రాజా సాబ్ రాక అనివార్యమే. దాంతో ప్రమోషన్స్ పీక్స్‌లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. నెల రోజుల ముందుగానే యుఎస్ బుకింగ్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర రన్ టైమ్‌పైనే తాజాగా చర్చ మొదలైంది. ఏకంగా 3.14 గంటల నిడివితో రాజా సాబ్ వస్తున్నాడని తెలుస్తుంది. ప్రభాస్ కెరీర్‌లో మొదటి హార్రర్ కామెడీగా వస్తుంది రాజా సాబ్. దాదాపు 300 కోట్లతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తుంది. కంటెంట్‌పై నమ్మకంతో 3 గంటల 14 నిమిషాలైనా పర్లేదంటున్నారు మేకర్స్. పుష్ప 2, యానిమల్ లాంటి ప్యాన్ ఇండియన్ సినిమాలకు రన్ టైమ్ సమస్యే కాలేదు.. కంటెంట్ కనెక్ట్ అయితే ఎన్ని గంటలనేది ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరు. గతంలో కల్కి 3 గంటల 1 నిమిషంతో వస్తే.. సలార్ 2.55 గంటలతో వచ్చిది. ఇక ఆదిపురుష్ నిడివి నిమిషం తక్కువ 3 గంటలైతే.. సాహో రన్ టైమ్ 2.50 నిమిషాలు. రాధే శ్యామ్ ఒక్కటే 2.18 గంటలతో వచ్చింది. మొన్నటికి మొన్న బాహుబలి ఎపిక్ 3.45 గంటలతో వచ్చింది. ఇవన్నీ బాగానే వర్కవుట్ అయ్యాయి. మరిప్పుడు రాజా సాబ్ ఏం చేస్తాడో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒకప్పడు వాళ్లదే చరిత్ర.. ఇప్పుడు గత చరిత్ర

TOP 9 ET News: సమంతకు రూ.కోట్లు విలువ చేసే గిఫ్ట్ ఇచ్చిన భర్త రాజ్‌

సెలబ్రిటీ వెడ్డింగ్‌లో కనిపిస్తున్న ఎరుపు రంగు చీరలు

Samantha: సమంత పెళ్లి వెనక పెద్ద కథే ఉందిగా

Akhanda 2: బాలయ్యకు గుడ్‌ న్యూస్ ఏపీలో బెనిఫిట్ షోలకు ఆ ధరకు గ్రీన్ సిగ్నల్.. తెలంగాణలో?